తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది యంగ్ హీరోలు( Young heroes ) వాళ్ళు చేస్తున్న సినిమాల ద్వారా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతూ ఉంటే మరి కొంతమంది హీరోలు మాత్రం స్టార్ హీరోల రేంజ్ నుంచి మీడియం రేంజ్ హీరోలా క్యాటగిరీకి పడిపోతూ ఉంటారు.
దానికి కారణం వాళ్ళు చేసే సినిమాలు పట్ల సరైన జడ్జిమెంట్ లేకపోవడమే అని చాలామంది సిని మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పరిస్థితి కూడా అలానే తయారయిందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం ( Arjun Reddy, Geetha Govindam )లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న తర్వాత ఆయన రేంజ్ అనేది స్టార్ హీరో రేంజ్ దాకా వెళ్ళిపోయింది.ఇక ఇలాంటి సమయంలో చేయాల్సిన సినిమాలు చాలా జాగ్రత్తగా చేస్తే బాగుండేది.
ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తూ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అసలు ఏ మాత్రం డిసిప్లేయిన్ లేకుండా వ్యవహరించడంతో ఆయన ఆటిట్యూడ్ కి చాలా మంది అతన్ని అభిమానించేవారు కూడా అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు.
అందువల్లే ఆయన కెరియర్ అనేది చాలా వరకు డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది.ఇక రీసెంట్ గా పరుశురాం( Parushuram ) డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ( Family star movie )ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా, ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అసలు ఏ మాత్రం అంచనా లేకపోవడం అనేది నిజంగా ఒక బ్యాడ్ లక్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో రిజల్ట్ తో అయిన విజయ్ మారిపోయి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది.
లేకపోతే ఆయన మార్కెట్ నంక భారీగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
.