కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు యాక్షన్ హీరో అర్జున్( Arjun ).ఈయన తెలుగు కన్నడ సినిమాలతో పాటు తమిళ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Arjun Sarja Shares Emotional Post About His Daughter Wedding Details, Arjun Sarj-TeluguStop.com

ప్రస్తుతం దర్శకుడుగా నిర్మాతగా కొనసాగుతున్న ఈయన ఇటీవల తన పెద్ద కుమార్తె ఐశ్వర్య( Aishwarya ) వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో( Umapathy ) ఐశ్వర్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జూన్ 10వ తేదీ జరిగింది.

ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహపు వేడుకలు జరిగాయి.హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి.అయితే తాజాగా అర్జున్ తన కుమార్తె పెళ్లికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోలో పెళ్లి పనులకు సంబంధించిన పనులు చేస్తూ కనిపించారు.అతిథులందరినీ ఆహ్వానించడమే కాకుండా తన అల్లుడికి గొడుగు పటి స్వయంగా అర్జున్ వేదిక పైకి తీసుకొచ్చారు.

ఇలా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని ఈయన షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మా ముద్దుల కుమార్తె ఐశ్వర్య తన జీవితంలో తన ప్రేమను తన ప్రియమైన ఉమాపతిని పెళ్లి చేసుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు రావడం లేదు.ఇది ప్రేమ, నవ్వుతో కలగలిపిన మరపురాని జ్ఞాపకాలతో నిండిన రోజు.

ఈ కొత్త జీవితబంధంలోకి, అధ్యాయంలోకి నువ్వు అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయం ఉప్పొంగిపోతుంది.మీరు ఎలాగైతే ప్రేమను పంచుకున్నారో అలాగే మీ జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని జీవితకాలపు ప్రేమ, సంతోషంతో నిండాలని వేలకోట్ల ఆశీర్వాదాలు పొందాలని అర్జున్ సర్జా ఎమోషనల్‌గా వీడియోను షేర్ చేశారు.

దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అభిమానులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube