అర్చన( Archana ) అనే పేరు చెప్పగానే మన తెలుగు వారందరికీ గుర్తుండే ఏకైక సినిమా నిరీక్షణ( Nireekshana ).ఈ సినిమానే ఆమె నటించిన తొలి సినిమా అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.
కానీ అప్పటికే ఆమె తెలుగులో రెండు మూడు సినిమాల్లో కనిపించింది.కానీ తెలుగులో కన్నా ఎక్కువగా తమిళంలోనే ఆమెకు పాపులారిటీ ఉంది.
తమిళ్లోనే కదా కలర్ ఎలా ఉన్నా కూడా ట్యాలెంట్ కి గుర్తింపు ఇస్తూ ఉంటారు.మన తెలుగు వారికి తెల్లటి రంగు ఉన్న హీరోయిన్స్ అంటేనే మక్కువ ఎక్కువ.
అందుకే కొంతమంది జాతీయ ఉత్తమ నటీమణులకు కూడా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు దొరకవు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అయిపోయిన అర్చనకు కనీసం యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కువగా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వడం లేదు.
ఏదైనా సరే మొహం మీద చెప్పే అర్చనకు అవకాశాలకు కాస్త ఇబ్బందులు అయితే వచ్చాయి.ఆమె మాట తీరు నచ్చిన తమిళులు మాత్రమే ఆమెను నెత్తిన పెట్టుకున్నారు.పైగా అర్చనలో ఎంత టాలెంట్ ఉంది అనే విషయం పక్కన పెట్టి ఆమె తన రంగును దాచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు.ఉదాహరణకు వాణిశ్రీని తీసుకోండి తన నల్ల రంగు కనిపించకుండా మూడు నాలుగు గంటల పాటు మేకప్ వేసుకొని బయటకు వచ్చేవారు అందుకే వందల కొద్ది సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ఒరిజినల్ కలర్( Archana Original Colour ) అప్పట్లో ఎవరికి తెలిసేది కాదు.
కానీ అర్చన విషయానికొస్తే ఆమె తన రంగును ఎప్పుడు దాచుకోలేదు తను నటించిన ప్రతి సినిమాలో ఆమె నలుపు అని తెలిసే విధంగా నే నటించారు.
అందువల్లే ఆమెకు సరైన అవకాశాలు రాలేదేమో అలాగే ఆమె ఎవరికి లొంగే మనిషి కూడా కాదు ఖచ్చితంగా మాట్లాడుతుంది తన తప్పు ఉంటే క్షమాపణ చెబుతుంది కానీ తన తప్పు లేకపోతే ఎదురు తిరుగుతుంది.అలాంటి లక్షణం ఇండస్ట్రీ వారికి సరిపోదు కదా తెలుగు ఇండస్ట్రీ( Telugu Film Industry )లో అయినా తమిళ్లో అయినా కూడా వంగి వంగి నమస్కారాలు పెడితేనే వారికి అవకాశాలు వస్తాయి.మొత్తానికి కలర్ ఎంత చక్కగా ఉంటే అన్ని అవకాశాలు.
కానీ కలర్( Skin Color ) ఉన్నంత మాత్రాన కంటెంట్ ఉంటుంది అని నమ్మకం లేదు కదా అర్చనకు బోలెడంత కంటెంట్ ఉంది కానీ కాస్త కలర్ తక్కువ.అందుకే ఈ అవకాశాల పోటీలో ఆమె వెనకబడిపోయింది.