ఏపీలో సెంటు భూమిలో నిర్మించే ఇళ్ల ఫోటోలు వైరల్... జగన్ ను ప్రశంసిస్తున్న రాష్ట్ర ప్రజలు !

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది.ఏడాది కాలంలో జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో దాదాపు 90 శాతం హామీలను అమలు చేయగా మిగిలిన 10 శాతం హామీలను అమలు చేయాల్సి ఉంది.

 Ap Government Patta House Photos Goes Viral, Cm Jagan, Ap Patta House, 30 Lakhs-TeluguStop.com

జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒకటి.మొదట మార్చి 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకం అమలు చేయాలని భావించినా వివిధ కారణాల వల్ల పథకం అమలు వాయిదా పడుతోంది.

జగన్ సర్కార్ ఆగష్టు 15వ తేదీన ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా ప్రభుత్వం సెంటు భూమిలో నిర్మించబోయే ఇంటి నమూనా సిద్ధమైంది.

ప్రభుత్వం సెంటు స్థలంలో ఒక ఇంటిని అందరినీ ఆకట్టుకునే విధంగా, ఆమోదయోగ్యంగా నిర్మించింది.కిచెన్, బెడ్ రూమ్, హాల్, బాత్ రూమ్ లతో ఉన్న ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వం అధికారికంగా ఫోటోలు విడుదల చేయకపోయినా అనధికారికంగా సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలకు సంబంధించిన నమూనాలే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

జగన్ సర్కార్ రాష్ట్రంలో ఇళ్లు లేని పేద ప్రజలు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తోంది.రాష్ట్రంలోని 30 లక్షల పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

వైరల్ అవుతున్న ఫోటోలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

ఇంటి నమూనా ఫోటోలు అద్భుతంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అనేక కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube