ఇటీవల వెబ్ సిరీస్ లు చాలా ఇంట్రస్టింగ్ గా సాగిపోతున్నాయి.లాక్ డౌన్ కారణంగా సినిమా హాల్స్ బంద్ చేయడం తో ఈ వెబ్ సిరీస్ లు వేగంగా పుంజుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ఆ మధ్య ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ ఒకటి విడుదలై విజయవంతమైంది.క్రిమినల్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు) స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
దీనితో ఇటీవలే ఆశ్రమ్ సెకండ్ సీజన్ ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలైంది.అయితే ఈ సెకండ్ సీజన్ ను కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ లో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గా బాబీ డియోల్ నటించగా ప్రకాశ్ ఝా డైరెక్ట్ చేశారు.అలానే ఈ వెబ్ సిరీస్ లో అతిథి పొహంకర్, అనుప్రియ గోయెంకా, అధ్యాయన్ సుమన్, దర్శన్ కుమార్ తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
అయితే తన నిజ జీవితంలో కూడా ఇలాంటి ఒక ఆధ్యాత్మిక గురువు వల్ల ఇబ్బందులు పడ్డాను అంటూ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని నటి అనుప్రియ గోయెంకా చెప్పుకొచ్చింది.తండ్రి ఆధ్యాత్మిక భావంతో నిండిన వ్యక్తి అని, ఆధ్యాత్మికత, భక్తి అంటే అర్థం నాన్న విషయంలో, నా విషయంలో పూర్తిగా వేర్వేరు అని చెప్పుకొచ్చింది.
తన యుక్త వయసులో ఉండగా మా కుటుంబం ఒక ఆధ్యాత్మిక గురువు ను విపరీతంగా నమ్మేది.అయితే అతడి పనులు ఆచరణాత్మకంగా సహేతుకంగా అనిపించడం తో అదృష్టవశాత్తు అతని బారి నుంచి నేను బయటపడగలిగాను అంటూ తను చెప్పుకొచ్చింది.

మనం ప్రపంచాన్ని నమ్మినపుడు, మంచి ఆలోచనలు, బాహ్య ప్రపంచంలో ఉన్న శక్తిని నమ్మినపుడు మంచి భావంకలుగుతుంది.నన్ను ఉత్తమంగా భావించేలా చేసే వ్యక్తి దేవుడనేది నా ఫీలింగ్ అని తన మనసులోని భావాలను షేర్ చేసుకుంది.ఇక ఆశ్రమ్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఆధ్యాత్మిక గురువు తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ఎలా లొంగదీసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు అన్న అంశం పై నడుస్తుంది.ఈ వెబ్ సిరీస్ లాక్ డౌన్ టైం లో విడుదలై విపరీతంగా ఆకట్టుకుంది.