ఆంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు...గుడ్ న్యూస్ వెనుకాలే...షాకింగ్ న్యూస్...!!!

అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.కరోనా పుట్టింది చైనా లో అయినా విరుచుకుపడింది మాత్రం అమెరికాపైనే.

 Pandemic Phase' Over For Us, But Covid-19 Still Here, Says Anthony Fauci,us, Ant-TeluguStop.com

ఈ మహమ్మారి దెబ్బకు ట్రంప్ అధికార పీటం నుంచీ గద్దె దిగే పరిస్థితి వచ్చిందంటే అప్పట్లో కరోనా పరిణామాలు ఎలా ఉన్నాయో ఊహించకోవచ్చు.అయితే కరోనా నుంచీ కోలుకుంటున్న అమెరికా ఎప్పటి లానే విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు, దిగుమతులు, విదేశీ ప్రయాణీలపై ఆంక్షలను సడలిస్తూ వచ్చింది.

అంటే అమెరికాలో కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల నుంచీ బయట పడిందని తెలిపారు.గడిచిన ఏడాది కాలంతో పోల్చితే పరిస్థితులు ఇప్పుడు అదుపులోకి వచ్చాయని అన్నారు ఫౌచీ.అమెరికాలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని అమెరికన్స్ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

Telugu America, Anthony Fauci, Covid Vaccine, Covid, Pandemic-Telugu NRI

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎన్నో రూపాలు దాల్చుతోందని, అయితే ఎప్పుడు ఎలా విరుచుకు పడుతుందో చెప్పలేమని మరో కొత్త వేరియంట్ ఉనికిలోకి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఈ కొత్త వేరియంట్ కారణంగా మళ్ళీ కేసుల సంఖ్య తీవ్ర తరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికన్స్ ఉలిక్కిపడేలా స్టేట్మెంట్ ఇచ్చారు.అమెరికాలో కరోనా పరిణామాలు కేవలం తగ్గుముఖం పట్టాయని మాత్రమే తాను చెప్పగలనని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే గత రోజులు మళ్ళీ చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు.ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం సూచలన మేరకు వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిదని సూచించారు ఫౌచీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube