తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఆయనను ఇట్టే గుర్తు పట్టిస్తారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలం సేవలు అందించారు అక్కినేని నాగేశ్వరరావు.హీరోగా మాత్రమే కాకుండా నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమా అభివృద్ధికి కృషి చేశాడు.
ఆయన ప్రస్థానం రంగస్ధలంపై మొదలైంది.నాటకాల్లో ఏఎన్నార్ ప్రతిభను గుర్తించిన దర్శకుడు గంటసాల బలరామయ్య ఆయన్ని ప్రోత్సహించాడు.
మద్రాసు తీసుకెళ్లి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇచ్చారు.1944లో విడుదలైన సీతారామ జననం( Sri Seeta Rama Jananam ) చిత్రంలో ఏఎన్నార్ రాముడు పాత్ర చేశారు.గంటసాల బలరామయ్య దర్శకత్వంలోనే ఏఎన్నార్ నటించిన బాలరాజు పేరు తెచ్చింది.కాగా 1953లో విడుదలైన దేవదాసు చిత్రంతో ఆయన స్టార్ అయ్యారు.తెలుగు, తమిళ భాషల్లో దేవదాసు భారీ విజయం సాధించింది.అక్కడి నుండి ఏఎన్నార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అనేక బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.ఒక దశకు వచ్చాక క్యారెక్టర్ రోల్స్ చేశారు.
కొడుకు నాగార్జునతో పాటు చిరంజీవి, బాలకృష్ణలతో మల్టీస్టారర్స్ చేశారు.
90 ఏళ్ల వయసులో కూడా ఆయన నటించారు.ఏఎన్నార్ చివరి చిత్రం మనం( Manam ).మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి నటించారు.ఏఎన్నార్ మరణం తర్వాత మనం విడుదలైంది.కీర్తితో పాటు అపార సంపద ఏఎన్నార్ ఆర్జించారు.అయితే నటుడిగా ఏఎన్నార్ మొదటి సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు.రంగస్థలంపై ఎదుగుతున్న రోజుల్లో ఒక నాటకం ఆడినందుకు అర్థ రూపాయి అనగా 50 పైసలు ఇచ్చారట.
నాటకాలు వదిలేసి సినిమాల్లోకి వెళ్లే నాటికి ఆయన సంపాదన 5 రూపాయలు.ఒక నాటకం ఆడితే అంత ఇచ్చేవారట.
ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు నాగేశ్వరరావు.ఇకపోతే తాజాగా అయినా శత జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సెలబ్రిటీలు కలసి ఆయన విగ్రహాన్ని స్థాపించారు.