ప్రతీ ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి వార్ జరుగుతూనే ఉంటుంది.స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఇక 2024 సంక్రాంతి ఫైట్ కోసం ఎప్పిటి నుండో వార్ మొదలయ్యింది.
వచ్చే ఏడాది పండుగకు బిగ్గెస్ట్ క్లాష్ ఉండనుందిని దీనిని బట్టే అర్ధం అవుతుంది.ఇప్పటికే పలు సినిమాలు అఫిషియల్ గా డేట్స్ ను లాక్ చేసుకోగా మరికొన్ని భారీ సినిమాలు సంక్రాంతి కోసం రెడీ అవుతున్నాయి.
ముందుగా 2024 సంక్రాంతి సీజన్ లో స్లాట్ ను రిజర్వ్ చేసుకుంది మాత్రం ప్రభాస్.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా ( Kalki )సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.కానీ ఇది వాయిదా పడింది…
ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమాను( Guntur Karam ) 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ పోటీలో మాస్ మహారాజ రవితేజ ఈగల్ కూడా రానుంది.అలాగే వీటితో పాటు హనుమాన్ సినిమాను కూడా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
ఇంకా విజయ్ – పరశురామ్ మూవీ కూడా సంక్రాంతికే రాబోతున్నట్టు దిల్ రాజు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారు.అలాగే నాగార్జున, విజయ్ బిన్నీ కాంబోలో వస్తున్న నా సామిరంగా సినిమా( Naa Saami Ranga ) కూడా సంక్రాంతి రేస్ లోనే ఉంది.ఇన్ని టాలీవుడ్ సినిమాల మధ్య తాజాగా మరో డబ్బింగ్ మూవీ పొంగల్ రేస్ కు రాబోతుంది.
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ”అయలాన్” ( Ayalaan )కూడా సంక్రాంతికి రాబోతుందని ప్రకటన వచ్చింది.దీంతో ఇన్ని సినిమాలు ఒకేసారి అంటే థియేటర్స్ దగ్గర కోరితే ఏర్పడే అవకాశం ఉంది.
అది కలెక్షన్స్ మీద కూడా ప్రభావం పడుతుంది.మరి ఈ ప్రకటించిన సినిమాల్లో ఎన్ని రిలీజ్ వరకు ఉంటాయో ఎన్ని వాయిదా పడతాయో వేచి చూడాలి.