సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాలనే ఆలోచనతో దేశంలో చాలామంది విద్యార్థులు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.సివిల్స్ ( Civils )లో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించిన అనిమేశ్ ప్రధాన్ ( Animesh Pradhan )సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.9 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయిన అనిమేశ్ ఇంటర్వ్యూ సమస్యలో తల్లిని కోల్పోయారు.క్యాన్సర్( Cancer తో తల్లిని మృతి చెందగా ఆ బాధను దిగమింగి మరీ అనిమేశ్ సక్సెస్ సాధించారు.
ఒడిశాకు( Odisha ) చెందిన అనిమేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకుని రావుర్కెలాలోని ఐఐటీ( IIT Raoorkela ) నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన అనిమేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్( Indian Oil Corporation Refineries in Delhi ) లో జాబ్ చేస్తున్నారు.తన సక్సెస్ గురించి అనిమేశ్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించానని తెలిపారు.
సోషియాలజీని ఆప్షనల్ గా ఎంచుకున్నానని ఆయన కామెంట్ చేశారు.
రోజుకు 6 గంటల పాటు చదివానని పరీక్షల కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని అనిమేశ్ చెప్పుకొచ్చారు.సివిల్స్ పరీక్షలో రెండో స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.నా కల నెరవేరిందని నా పేరెంట్స్ కు కృతజ్ఞతలు అని అనిమేశ్ కామెంట్లు చేశారు.
గత నెలలో సివిల్ సర్వీసెస్ పరీక్ష సమయంలో అమ్మను కోల్పోయానని అనిమేశ్ చెప్పుకొచ్చారు.
నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో నాన్నను కోల్పోయానని అనిమేశ్ కామెంట్లు చేశారు.తాను ఐఏఎస్ కు ప్రాధాన్యత ఇచ్చానని ఒడిశా క్యాడర్ ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.నా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నానని అనిమేశ్ చెప్పుకొచ్చారు.
అనిమేశ్ ప్రధాన్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.అనిమేశ్ ప్రధాన్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.