తెలుగు సినీ ప్రేక్షకులకు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్( Anchor Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అనసూయ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.మొన్నటి వరకు యాంకర్ గా ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా మారి వరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
అయితే ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అవుతోంది.
మొన్నటివరకు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) విషయంలో హైలెట్ కాగా ఈ మధ్యకాలంలో ఆమె వ్యక్తిగత విషయాలు అలాగే సోషల్ మీడియాలో చేసే ట్వీట్ ల విషయంలో కూడా హైలెట్ అవుతోంది.ఒక వర్గం ప్రేక్షకులు అనసూయ ఎటువంటి ట్వీట్ చేసినా కావాలనే ఆమెను టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడుతూ మరి ఆమెపై ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా ఉంటే తాజాగా అనసూయ స్వల్ప అస్వస్థతకు గురయింది.
వైరల్ ఫీవర్( Viral Fever )తో ఆమె గత కొన్నిరోజుల నుంచి బాధపడుతోంది.అయితే ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆమె తాజాగా వరుస ట్వీట్స్ చేశారు.
వైరల్ ఫీవర్ కారణంగా ఐదు రోజుల నుంచి బాధపడుతున్నాను.దాని వల్ల ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం ఉండటానికి వీలు కుదిరింది.
ఇక్కడ ఎన్నో విషయాలు గుర్తించాను.ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకపోవడం చూశాను.వేధింపులు ఉన్నాయి.హుందాతనం లోపించడం చూసి.మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయాను అని ట్వీట్ లో రాసుకొచ్చింది.ఈ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్స్( Netizens ) నీకు వచ్చింది వైరల్ ఫీవరే కదా అదేదో రోగం వచ్చినట్టుగా పెద్ద ఫీల్ అవుతున్నావు అని కొందరు కామెంట్స్ చేయగా, దీనికి కూడా ఓవరాక్షన్ అవసరమా అంటూ ఆమెపై నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తనపై ఆ విధంగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి అనసూయ కూడా దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం ఇస్తోంది.