అమ్మాయిల విషయంలో అలా బిహేవ్ చేస్తానన్న ఆనంద్.. అది అంటే పిచ్చిప్రేమంటూ?

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) నటించిన బేబీ మూవీ( Baby Movie ) జులై నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా కచ్చితంగా ఆనంద్ దేవరకొండ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Anand Devarakonda Comments About Girls Details, Anand Devarakonda, Baby Movie, B-TeluguStop.com

ఆనంద్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను బైక్ స్టాండ్ పై కూర్చున్న సమయంలో వెళ్తున్న అమ్మాయిలను చూశానని ఆ సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని ఆనంద్ అన్నారు.

ఆ తర్వాత ఆనంద్ మాట్లాడుతూ నాకు ఎలాంటి లవ్ స్టోరీ( Love Story ) లేదని చెప్పుకొచ్చారు.అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు భయమని ఆయన పేర్కొన్నారు.నాకు మ్యూజిక్ అంటే పిచ్చి ప్రేమ అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.

Telugu Baby, Sai Rajesh-Movie

నేను యాక్సిడెంటల్ యాక్టర్ అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.మా అన్న స్టార్ కావడంతో నాకు అవకాశాలు రావడం మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాను చూసే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహా అనుభూతిని పొందుతారని ఆయన కామెంట్లు చేశారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ చాలా మందికి రిలేట్ అయ్యేలా నా పాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Baby, Sai Rajesh-Movie

డైరెక్టర్ సాయి రాజేష్ వైష్ణవి చైతన్యను( Vaishnavi Chaitanya ) ఆట పట్టించారని ఆనంద్ దేవరకొండ కామెంట్లు చేశారు.వైష్ణవి అద్భుతంగా చేసినా బాగా చేయలేదని అనేవారని, కట్స్ చెప్పకుండా ఉండేవారని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బేబీ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube