అమ్మాయిల విషయంలో అలా బిహేవ్ చేస్తానన్న ఆనంద్.. అది అంటే పిచ్చిప్రేమంటూ?

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) నటించిన బేబీ మూవీ( Baby Movie ) జులై నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా కచ్చితంగా ఆనంద్ దేవరకొండ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆనంద్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను బైక్ స్టాండ్ పై కూర్చున్న సమయంలో వెళ్తున్న అమ్మాయిలను చూశానని ఆ సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని ఆనంద్ అన్నారు.

ఆ తర్వాత ఆనంద్ మాట్లాడుతూ నాకు ఎలాంటి లవ్ స్టోరీ( Love Story ) లేదని చెప్పుకొచ్చారు.

అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు భయమని ఆయన పేర్కొన్నారు.నాకు మ్యూజిక్ అంటే పిచ్చి ప్రేమ అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.

"""/" / నేను యాక్సిడెంటల్ యాక్టర్ అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.మా అన్న స్టార్ కావడంతో నాకు అవకాశాలు రావడం మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమాను చూసే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహా అనుభూతిని పొందుతారని ఆయన కామెంట్లు చేశారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ చాలా మందికి రిలేట్ అయ్యేలా నా పాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / డైరెక్టర్ సాయి రాజేష్ వైష్ణవి చైతన్యను( Vaishnavi Chaitanya ) ఆట పట్టించారని ఆనంద్ దేవరకొండ కామెంట్లు చేశారు.

వైష్ణవి అద్భుతంగా చేసినా బాగా చేయలేదని అనేవారని, కట్స్ చెప్పకుండా ఉండేవారని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.

బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బేబీ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?