'సలార్‌' హిట్‌ అవ్వకుంటే ప్రభాస్ మార్కెట్‌ పరిస్థితి ఏంటో..!

బాహుబలి సినిమా కు ముందు ప్రభాస్( Prabhas ) మార్కెట్ పరిస్థితి ఏంటో అందరికి తెల్సిందే.ఆయన సినిమా లు అంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆయన సినిమా లు చూసేవారు.

 Prabhas Salaar Movie And His Career Prabhas , Salaar, Adipurush , Sahoo, Tollyw-TeluguStop.com

కానీ ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్‌ డమ్ ను దక్కించుకున్నాడో అప్పటి నుండి కూడా ఆయన నటించే ప్రతి సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు మరియు అభిమానులకు చేరువ అవుతోంది.ప్రభాస్ బాహుబలి 2 సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించింది.

అప్పటి నుండి ఆయన నటించిన సినిమా లకు మంచి బజ్ అయితే ఉంది.కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.

Telugu Adipurush, Baahubali, Bollywood, Ktiti Sanaon, Prabhas, Sahoo, Salaar, To

బాహుబలి సినిమా తర్వాత సాహో.రాధేశ్యామ్‌.ఆదిపురుష్( Adipurush) సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ మూడు సినిమా లు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఇప్పుడు సలార్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మూడు సినిమా లు ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ సలార్ సినిమా విపరీతమైన బజ్ తో రాబోతుంది.

ఇక ప్రభాస్ యొక్క మార్కెట్‌ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి అంటే సలార్‌ సినిమా ఓ రేంజ్ లో బిజినెస్ చేసింది.ఇంకా చేస్తూనే ఉంది.

Telugu Adipurush, Baahubali, Bollywood, Ktiti Sanaon, Prabhas, Sahoo, Salaar, To

అయిదు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సలార్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ సలార్ సినిమా కనుక నిరాశ పర్చితే మాత్రం ప్రభాస్ మార్కెట్‌ ఈసారి చాలా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రభాస్ మూవీ హిట్ అయితే పర్వాలేదు కానీ ఆయన సలార్ 2( Salaar ) యొక్క మార్కెట్‌ కూడా చాలా డల్ గా మారే అవకాశాలు ఉన్నాయి.మారుతి దర్శకత్వం లో చేసే సినిమా మరియు ప్రాజెక్ట్‌ కే సినిమా పరిస్థితి కూడా కచ్చితంగా ప్రభాస్ కెరీర్‌ లో దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ ఫలితం ఆధారంగానే ఆయన కెరీర్‌ ఆధారపడి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube