అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ పార్టీ సెకండ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ కోసం సిద్ధమైంది.ఈ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వారు.
ట్రంప్( Trump ) దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు.ఈసారి కూడా ట్రంప్ ఈ చర్చా కార్యక్రమానికి దూరంగానే వుంటున్నట్లు ప్రకటించారు.
ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్ హోస్ట్ చేసే ఈ ఈవెంట్ కోసం ఏడుగురు రిపబ్లికన్ అభ్యర్ధులు రోనాల్డ్ రీగన్( Ronald Reagan ) ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి రానున్నారు.ట్రంప్ మిచిగాన్‌లో వుంటారు.
అక్కడి ఆటో వర్కర్స్ యూనియన్ సమ్మెను సద్వినియోగం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ర్యాంక్ అండ్ ఫైల్ యూనియన్ సభ్యుల మద్ధతును అభ్యర్ధించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
కాగా.జీవోపీ ప్రచారంలో కీలకమైన సమయం వచ్చింది.అయోవా కాకస్‌లు అధ్యక్ష నామినేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించడానికి ముందు ట్రంప్ ఆధిపత్యాన్ని తగ్గించాలని రిపబ్లికన్ పార్టీలోని( Republican Party ) అతని ప్రత్యర్ధులు భావిస్తున్నారు.ట్రంప్‌కు జైలు శిక్ష పడే స్థాయిలో వున్న నాలుగు నేరారోపణలు సహా ఇతర విషయాలను హైలైట్ చేయాలని వారు యోచిస్తున్నారు.
గత నెలలో మిల్వాకీలో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు కూడా ట్రంప్ హాజరుకాలేదు.నాటి చర్చను 13 మిలియన్ల మంది వీక్షించారు.
ఈ డిబేట్‌లో సౌత్ కరోలినా( South Carolina ) మాజీ గవర్నర్ , ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలి( Nikki Haley ).విదేశాంగ విధానంపై వివేక్ రామస్వామిపై విమర్శలు గుప్పించారు.దీంతో ఆ మరుసటి రోజు నుంచే నిక్కీహేలీకి ఎక్కడా లేని పాపులారిటీ వచ్చింది.పోల్ సర్వేల్లో ముందంజతో పాటు విరాళాలు కూడా బాగానే వస్తున్నాయి.బుధవారం సెకండ్ రౌండ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ కావడంతో దీనికి తాము సిద్ధంగా వున్నామని నిక్కీ ప్రచార బృందం స్పష్టం చేసింది.మరో రిపబ్లిక్ నేత , ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా బుధవారం జరిగే చర్చ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ట్రంప్‌కు తానే ప్రత్యామ్నాయంగా మారాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.మాజీ వైస్ ప్రెసిడెంట్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి కూడా ఈ డిబేట్ కోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.