అమెరికా కీలక నిర్ణయం... వాళ్ళందరూ అర్హులే..

కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోయిన అమెరికా ఎంతటి భారీ నష్టాన్ని చవి చూసిందో అందరికి తెలిసిందే.లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోగా ఇప్పటికి మహమ్మారి కారణంగా రోజు రోజుకు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

 America's Key Decision They All Deserve It , America, Corona, Vaccination, Joe-TeluguStop.com

బిడెన్ అధికారంలోకి వచ్చీ రాగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో కరోనా కేసులు , మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.అమెరికా వ్యాప్తంగా మొదటి రెండవ డోస్ లు దాదాపు పూర్తయిన నేపధ్యంలో తాజాగా కరోనా మార్పులపై అధ్యయనం చేసిన శాస్త్ర వేత్తల బృందం కరోనా బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరికి అవసరమని సూచించింది.

అమెరికా వ్యాప్తంగా ఇంకా కరోనా మొదటి, రెండవ డోస్ లు ఒక పక్క కొనసాగుతూనే ఉండగా బూస్టర్ డోస్ కు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.అయితే ఈ అనుమతులు దాదాపు 3 నెలల క్రితమే ఇవ్వగా ఏ ఏ వయసుల వారికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం నుంచీ స్పష్టత కోసం ఎదురు చూసి తాజాగా బూస్టర్ డోస్ 18 ఏళ్ళు దాటినా వారు ఎవరైనా సరే వేసుకునేందుకు అర్హులుగా ప్రకటించింది.

Telugu America, Americaskey, Booster Dose, Corona, Joe Biden-Telugu NRI

అమెరికా ఆహార ఔషద నియంత్రణ సంస్థ అనుమతులతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 20 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ లు వేసుకోగా వీరందరూ బూస్టర్ డోసుకు అర్హులని పేర్కొంది.శీతాకాలంలో కరోనా కేసులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది.గతంలో 65 ఏళ్ళు దాటిన వారికి బూస్టర్ డోస్ వేసే విషయంలో ఆలోచన చేసిన ప్రభుత్వం నిపుణుల సలహా మేరకు 65 ఏళ్ళు దాటినా వారు కూడా బూస్టర్ డోస్ వేసుకోవచ్చని ప్రకటించింది.

దీన్ని బట్టి 18 వయసు లోపు ఉన్న వారికి బూస్టర్ డోస్ అనుమతి లేదని 18 ఏళ్ళ వయసు పై బడిన వారికి బూస్టర్ డోస్ వేసుకునేందుకు అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube