అంబానీ కొత్త వ్యాపారంతో 5 కంపెనీలకు చెక్ పడనుంది!

ఇషా అంబానీ( Isha Ambani ) గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.ఆమె తండ్రికి మించిన తనయగా వ్యాపార ప్రపంచంలో దూసుకు పోతోంది.

 Ambani Will Check 5 Companies With New Business! Mukesh Ambani, New Business, O-TeluguStop.com

ఇప్పటికే ఉన్న వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లటంతో పాటు ఆమె కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ ప్రత్యర్థులకు అస్సలు ఆలోచించే సమయం ఇవ్వటం లేదని తాజా బిజినెస్ సర్వేలు చెబుతున్నాయి.ఇకపోతే, దేశంలో ఈస్తటిక్ కేఫ్‌లు, స్వదేశీ కాఫీ చెయిన్‌లకు డిమాండ్ ఎలా పెరుగుతుందో మనం చూస్తూనే వున్నాం.

ఈ క్రమంలో ఇపుడు రిలయన్స్ బ్రాండ్స్ లండన్ ఆధారిత రెస్టారెంట్ చైన్‌తో జతకట్టడం కొసమెరుపు.

Telugu Bussiness, Isha Ambani, Latest, Mukesh Ambani, Kingdom-General-Telugu

అవును, రిలయన్స్ రిలయన్స్ బ్రాండ్స్ లండన్‌కు చెందిన EL&N కేఫ్‌ చైన్ ను ఇండియాలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈ ఏడాది జరిగిన త్రైమాసిక సమావేశంలో అధికారికంగా వెల్లడించడం జరిగింది. EL&N కేఫ్స్ గురించి మీలో కొంతమంది వినే వుంటారు.యునైటెడ్ కింగ్‌డమ్‌( United Kingdom )లో ఉన్న ప్రత్యేకమైన ఆహార పానీయాల రిటైల్ బ్రాండ్స్ లో ఇదొకటి.

ఇప్పటికే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాన్స్, లండన్, ఇటలీ, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో తన మార్కెట్‌ను భారీగా విస్తరించింది.ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 27కి పైగా సంస్థలను కలిగి ఉంది ఈ కంపెనీ.

Telugu Bussiness, Isha Ambani, Latest, Mukesh Ambani, Kingdom-General-Telugu

ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అరేబియన్-నేపథ్య ఇంటీరియర్స్, యూత్-సెంట్రిక్ వాతావరణంతో అత్యంత అద్భుతంగా, సుందరగా కేఫ్‌లను కలిగి ఉన్న బ్రాండ్‌గా గుర్తింపును కలిగి వుండడం దాని ప్రత్యేకత.దీనికి ముందు రిలయన్స్ రిటైల్ ప్రముఖ యూకే శాండ్‌విచ్ కాఫీ చైన్ ప్రెట్ ఎ మాంగర్‌తో జతకట్టిన విషయం విదితమే.కాగా అంబానీల ఈ కొత్త కాఫీ చెయిన్ టాటా గ్రూప్‌కు చెందిన స్టార్‌బక్స్‌( Starbucks ) కు గట్టి పోటీనివ్వనుందని పరిశీలకులు అంటున్నారు.ఇదే క్రమంలో ది బిగ్ చిల్, డిగ్గిన్, కేఫ్ ఢిల్లీ హైట్స్‌, స్టార్‌బక్స్, కోస్టా కాఫీ వ్యాపారాలకు ముప్పు తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube