వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM jagan ) ఢిల్లీ టూర్ అందరికీ ఆసక్తికరంగా మారింది.అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ ( Jagan Delhi tour)పెట్టుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ కాగా , ఆయన కుమారుడు నారా లోకేష్ పైన ఇన్నర్ రింగ్ రోడ్ , ఫైబర్ నెట్ స్కాం లు ఉన్నాయి. ఇక చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర బిజెపి పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతుండడం , ఎన్డీఏ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినట్లుగా ప్రకటించిన నేపథ్యంలో , జగన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది .నిన్ననే ఢిల్లీకి వెళ్లిన జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Nirmala sitharaman ) తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలను త్వరగా విడుదల చేయాలని జగన్ కోరారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, పెండింగ్ నిధులు ఇస్తే ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు ఇబ్బంది ఉండదని నిర్మల సీతారామన్ తో చెప్పారట .ఇక జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ,( Vijayasai Reddy ) ఎంపీ మిధున్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు.ఇక ఈ రోజు జగన్ షెడ్యూల్ చూసుకుంటే.వామపక్ష తీవ్రవాదం నిర్మూలన అనే అంశంపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో జగన్ పాల్గొంటారు .

ఏపీలో వామపక్ష తీవ్రవాదం ఉందా లేదా అనే విషయం పైన జగన్ ప్రసంగించనున్నారు .అలాగే ఈ రోజు రాత్రి అమిత్ షా ( Amit Shah )తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు అరెస్టు , ( Chandrababu arrest )జనసేన వ్యవహారం, రాబోయే రోజుల్లో ఎన్నికలు, పొత్తుల అంశం పైన జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అలాగే కొంతమంది కేంద్ర మంత్రులతోనూ జగన్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు.తన ఢిల్లీ టూర్ లో ఏపీకి సంబంధించిన నిధులు ,పెండింగ్ ప్రాజెక్టుల అంశాలతో పాటు టిడిపి జనసేన వ్యవహారం పైన చర్చించబోతుండడంతో , కేంద్ర బిజెపి పెద్దల నుంచి జగన్ కు ఏ విధమైన సహకారం అందబోతుంది, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏ ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.







