ఈ ఫోటోలో స్టార్ హీరో ఎవరు అనేది గుర్తుపట్టారా? ఇంకా లేదా? అయ్యో.కరోనా వైరస్ లాక్ డౌన్ వచ్చాక అందరూ మాస్కులు వేసుకొని దర్శనం ఇస్తున్నారు.
ఇక అప్పుడప్పుడు రీల్ లో కాకుండా రియల్ గా కనిపించే సెలబ్రెటీలు అందరూ కూడా మాస్కులు ధరించి కామన్ మ్యాన్ లా తిరిగేస్తున్నారు.ఇక అలానే ఇప్పటికే స్టార్ హీరోయిన్లు, హీరోలు అందరూ కూడా కామన్ మ్యాన్ లా మాస్కులు పెట్టుకొని తిరిగేస్తున్నారు.
అలానే ఈ స్టార్ హీరో కూడా మాస్కు పెట్టుకొని తిరిగేస్తున్నాడు.
అతను ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఇటీవల మెగా డాటర్ కొణిదెల నిహారిక పెళ్ళికి కుటుంబంతో సహా హాజరైన అల్లు అర్జున్ పెళ్లి ముగించుకుని వస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటో.కాగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ స్టైల్ మొత్తం మారిపోయింది.ఊర మాస్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ పుష్ప సెట్ లోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన కూడా నటిస్తుంది.కాగా అల్లు వారి ఆహా లో సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న సామ్ జామ్ షోకి అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు.
ఈ షో త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది.కాగా అల్లు అర్జున్ ఇటీవల తన కూతురుఅర్హతో అంజలి అంజలి అంటూ ఓ పాటను విడుదల చెయ్యగా అందులో అర్హ ఎంతో ముద్దు ముద్దుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.