ఎవరో గుర్తుపట్టారా? ఇంకా లేదా? అయ్యో.అతనే అండి అడివి శేష్.
ప్రస్తుతం ఎంతో థ్రిల్లింగ్ సినిమాల తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అడివి శేష్ తన చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఉన్నాడు.కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.
పవన్ కళ్యాణ్ సినిమా పంజాలో నటించిన అడివి శేష్ గురించి తెలిసినంతగా సొంతం సినిమాలో నటించిన అడివి శేష్ గురించి చాలామందికి తెలియదు.
సొంతం సినిమాలోనే ఆయన కీలక పాత్ర లో నటించాడు.
ఆ సినిమాలో అడివి శేష్ ఉన్నట్టు కూడా ఎవరు గుర్తించలేరు.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అడివి శేష్ ఫోటో లు వైరల్ అవుతున్నాయ్.
అప్పట్లోనే అడివి శేష్ సినిమా ల్లో నటించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇప్పుడు సరికొత్త కథనాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు అడివి శేష్.
అతను తీసిన క్షణం సినిమా నుంచి గూఢచారి, ఎవరు వంటి సినిమాలు తీసి టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
కర్మ, కిస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అడివి శేష్ ఆతర్వాత రైటర్ గా మాత్రమే కొనసాగారు.ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటించిన అడివి శేష్ బాహుబలి సినిమాలో కూడా నటించాడు కానీ బాహుబలి రేంజ్ గుర్తింపు రాలేదు.ఇలా ఎన్నో సినిమాల్లో నటిస్తూ.
గెస్ట్ పాత్ర ల్లో అలరిస్తూ రైటర్ గాను తన సత్తా ఏంటో చూపిస్తున్నారు.అంతేకాదు.
ప్రస్తుతం అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ చిత్రాన్ని హీరో మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల తన చిన్ననాటి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ ఫొటోలో అడివి శేష్ చిన్నప్పుడే మేజర్ గా ఉన్న ఫోటో అది.