ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్( Adipurush ) సినిమా మీద ఇప్పటికే జనాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా మీద జనాల్లో కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాతో బాహుబలి రికార్డ్ ( Baahubali )కూడా బ్రేక్ అవుతుంది అని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి.ముందుగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, అక్కడ ఇప్పటి వరకు రెండు లక్షల డాలర్లు గ్రాస్ వచ్చింది.
అలా మన ఇండియా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి…
ముందుగా నార్త్ ఇండియా బెల్ట్ బుకింగ్స్ ని ప్రారంభించగా, అక్కడ ఈ సినిమా ప్రారంభం నుండే అద్భుతాలు సృష్టించడం ప్రారంభించింది.PVR ముల్టీప్లెక్స్ చైన్స్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకి పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట.ఈ స్థాయిలో టికెట్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘పఠాన్( Pathaan )’ కి కూడా అమ్ముడుపోలేదని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు…

పఠాన్’ చిత్రానికి PVR మల్టిప్లెక్స్ చైన్స్ లో విడుదలకు ముందు రోజు వరకు 5 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్, అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు ఈ చిత్రానికి PVR చైన్స్ లో 3 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.కానీ ఆదిపురుష్ చిత్రానికి మొదటి రోజు బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.పఠాన్ చిత్రానికి మొదటి రోజు ఇండియా లో 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి…

ఇప్పుడు ఈ రికార్డు ని ఆదిపురుష్ చిత్రం ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కచ్చితంగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.టికెట్ రేట్స్ కోసం నిర్మాతలు అప్లై చేశారట.
అవి వచ్చేంతవరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వవు అని చెప్తున్నారు బయ్యర్స్… అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది…