స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గురించి ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొంతమంది ఆయన గురించి పాజిటివ్ గా చెబుతుంటే మరి కొందరు ఆయన గురించి నెగిటివ్ గా చెబుతుంటారు.
ప్రకాష్ రాజ్ షూటింగ్ కు సరిగ్గా హాజరు కాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సంధ్యా జనక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసిన షూటింగ్ లు కూడా ఉన్నాయని తెలిపారు.
వారసుడు సినిమాలో రష్మిక మదర్ రోల్ లో నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆమె తెలిపారు.ఆ తర్వాత తమిళ నటి ఆ సినిమాలో నటించిందని తెలిసిందని సంధ్య అన్నారు.
క్యారవాన్స్ విషయంలో ఎక్కువగా సమస్యలు వస్తాయని సంధ్య వెల్లడించారు.క్యారవాన్ లో వేరే వాళ్లు ఉంటే నా పని నేను చేసుకునేదానినని సంధ్య పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ గారితో షూట్ అంటే నాకు చాలా భయమని ఆమె అన్నారు.
ప్రకాష్ రాజ్ గారు ఒక లెజెండ్ అని ఆయనకు కొంచెం షార్ట్ టెంపర్ అని సంధ్యా జనక్ తెలిపారు.
ఆయనకు సినీ అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని సంధ్యా జనక్ చెప్పుకొచ్చారు.ఆయన కాంబినేషన్ లో సీన్లు ఉన్న సమయంలో డైలాగ్స్ సరిగ్గా చెప్పకపోతే ఎలా అని నేను భయపడేదానినని సంధ్యా జనక్ తెలిపారు.
రమాప్రభ గారు క్రిటికల్ అని ఆమె కంపేర్ చేస్తారని సంధ్యా జనక్ అన్నారు.ఆ రోజుల్లో ఒకే షెడ్యూల్ లో షూట్ పూర్తయ్యేదని అప్పటి వాతావరణం ఇప్పటి వాతావరణం మారిందని సంధ్యా జనక్ అన్నారు.
ఆవిడ కొంచెం ఇరిటేట్ అవుతారని డైరెక్టర్లకు కూడా ఆమె సూచనలు ఇస్తారని సంధ్యా జనక్ కామెంట్లు చేస్తున్నారు.