గన్నవరం ఎయిర్ పోర్టులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.విమానాశ్రయంలో పోలీసులు, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగింది.
అనుమతి లేకుండా ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు.ఈ క్రమంలో భద్రతా విభాగం పోలీసులు అనుమతి లేదని తెలిపారు.
ఏసీపీ వెంకటరత్నంతో జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని గొడవకు దిగారు.ఈ నేపథ్యంలో ట్రాన్స్ ఫర్ చేయిస్తానంటూ ఏసీపీకి గౌసాని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనంతరం పోలీసుల తీరుపై ఎంపీ బాలశౌరికి ఫిర్యాదు చేశారు.