భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సోంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.పోడు రైతులు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
సోంపల్లిలో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను సమీప ప్రాంత పోడు రైతులు తొలగించారు.ఈ నేపథ్యంలో అధికారులకు, పోడు రైతులకు మధ్య చెలరేగిన వివాదం.
తీవ్ర ఘర్షణకు దారి తీసింది.కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీస్, రెవెన్యూ శాఖ ప్రయత్నించింది.
దీంతో సోంపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







