రాను రాను సమాజంలో ఆడవారిపై జరుగుతున్న వేధింపులు అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరిగిపోతోంది.కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు సైతం రక్షణ లేకుండా పోతోంది.
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.చిన్న చిన్న నటుల దగ్గర నుంచి టాప్ డైరెక్టర్ నిర్మాతల వరకు చాలామంది ఆడవారి విషయంలో తప్పుగా ప్రవర్తించడంతోపాటు వారిని బలవంత పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అయితే కొందరు నటీమణులు ఏమి చేయలేక సినిమాలను వదిలేస్తుండగా మరికొందరు ధైర్యం తెచ్చుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తాజాగా నటి అంజలి నాయర్ కూడా ఒక ప్రముఖ నటుడిపై వేధింపుల కేసు పెట్టింది.ఈ సందర్భంగా ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.నేను నా మొదటి తమిళ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నాను.
అందులో విలన్ పాత్రధారుడు నాతో తప్పుగా ప్రవర్తించడానికి చూశాడు.ఆ విలన్ ఆ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
సినిమా షూటింగ్ అయిపోయినా కూడా అతడు నన్ను ఇంటికి పంపించేవాడు కాదు.నాతో పని లేకపోయినా అక్కడే ఉంచేవాడు.
నాతో తరచుగా తప్పుగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా నన్ను ప్రేమిస్తున్నాను అనేవాడు.అలా ఒక రోజు నన్ను ట్రైన్లో నుంచి కిందకు తోసేసి చంపాలని అనుకున్నాడు.

నన్ను ఎన్నో విధాలుగా అతడు వేధించాడు.అతని వేధింపులు తాళలేక నేను పోలీసులను ఆశ్రయించాను.అతనిపై కేసు పెట్టాను ఇక్కడ ఉండలేక మళ్ళీ కేరళకు వెళ్లిపోయాను అని చెప్పుకొచ్చింది అంజలి నాయర్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ నటుడు ఎవరా అని నెటిజన్స్ ఆరాతీయడం మొదలుపెట్టారు.
కాగా అంజలి నాయర్ కేవలం తమిళంలో మాత్రమే కాకుండా మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.కాగా ఈమె 2011లో మలయాళ దర్శకుడు అనీష్ ను పెళ్లి చేసుకోగా వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.
కాగా గత ఏడాది ఆమె డైరెక్టర్ అజిత్ ను రెండో వివాహం చేసుకుంది.