ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.బాహుబలి సినిమా తర్వాత ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత తను చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలను దక్కించుకొని వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పుడిప్పుడే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
“రాధేశ్యామ్” చిత్ర నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాలో బిజీ అయ్యారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోనే తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రస్తుతం భారీ యాక్షన్ నైట్ సన్నివేశాలను తెరకెక్కించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఇప్పటికే ఓ విలన్ డెడ్ సెట్‌ను కూడా తయారు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం షూటింగ్ జరుపుకొనే ఈ యాక్షన్ సన్నివేశం ఈ సినిమాకి హైలెట్ గా మారిబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది.ఇప్పటికే ఈమె కూడా సినిమా షూటింగులో జాయిన్ అయ్యారని సమాచారం.శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.