టీడీపీ నేత నారా లోకేశ్ పై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్ర ఆరోపణలు చేశారు.నారా లోకేశ్ తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు.తాను చచ్చిపోతే లోకేశ్ దే బాధ్యతని పోసాని వెల్లడించారు.తనపై లోకేశ్ రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారన్నారు.ఈ క్రమంలోనే లోకేశ్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు.సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేశ్ పై పరువు నష్టం దావా వేయకూడదా అని ప్రశ్నించారు.
లోకేశ్ పై పరువునష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైలులో ఉంటారని తెలిపారు.తానూ కేసు పెడతానన్న పోసాని నిజం కావాలా అని ప్రశ్నించారు.ఇందుకు సాక్ష్యం కావాలా అని నిలదీశారు.