టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా కాలం క్రితం రాజకీయాలంటే తనకు నిజంగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తనకు సినిమాల్లోకి రావాలని కూడా లేదని పవన్ అన్నారు.
యాక్టర్ అవ్వాలని కూడా అనుకోలేదని పుస్తకాల షాపు పెట్టుకుందామని చిరంజీవికి బాడీగార్డ్ గా ఉందామని అనుకున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అలాంటి తాను కర్మ సరిగ్గా లేక రాజకీయాల్లోకి, సినిమాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
దేశం కోసం తాను బాధ్యతతో పని చేస్తున్నానని పవన్ తెలిపారు.చాలామందికి సినిమా ఇండస్ట్రీ కష్టం తెలియదని పవన్ అన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా సినిమాల్లోకి వచ్చారని పవన్ తెలిపారు.సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉండవని పవన్ పేర్కొన్నారు.
సినిమా తీయడం, సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కష్టమని పవన్ చెప్పుకొచ్చారు.
సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సినిమా పరిశ్రమ జోలికి వస్తే అందరూ ఏకం కావాలని పవన్ తెలిపారు.రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించడం అందరికీ గర్వకారణమని పవన్ చెప్పుకొచ్చారు.వైసీపీ నాయకులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పి విరుద్ధంగా పనులు చేస్తూ ఉంటారని పవన్ అన్నారు.
నా సినిమాలు ఆపుకోండి సినిమా పరిశ్రమను మాత్రం వదిలేయండని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.సినిమాల్లోకి వచ్చాక తాను అన్నయ్య సహకారం తీసుకోలేదని సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సొంతకాళ్లపై నిలబడాలని వాళ్లకు సూచించానని వాళ్ల సినిమాల వేడుకలకు గతంలో నేను హాజరు కాలేదని పవన్ పేర్కొన్నారు.అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో రిపబ్లిక్ సినిమా రిలీజ్ కానుంది.
సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు.