ఆ కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించిన నాగబాబు.. చివరివరకు అంటూ?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో ఒకటనే సంగతి తెలిసిందే.ఆదివారం రోజున బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లతో ఆర్మీలు మొదలయ్యాయి.

 Actor Nagababu Support Bigg Boss Contestant Priyanka Singh, Bigg Boss Contestant-TeluguStop.com

గత సీజన్ లో ఎక్కువమంది సెలబ్రిటీలు అభిజిత్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో మొదట మిత్రులుగా ఉన్నవాళ్లే తర్వాత రోజుల్లో శత్రువులయ్యే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మొదలు కావడంతో రాబోయే రోజుల్లో గొడవలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో సైతం ఆయా కంటెస్టెంట్ల అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ పై విమర్శలు చేసిన వారిపై గొడవలకు దిగుతుండటం గమనార్హం.

ప్రముఖ సినీ నటులలో ఒకరైన నాగబాబు ప్రియాంక సింగ్ కు తన మద్దతు ప్రకటించారు.

బిగ్ బాస్ హౌస్ లో రవి, ప్రియ, సింగర్ శ్రీరామ్ చంద్ర, నటరాజ్ మాస్టర్ పాల్గొన్నారని అయితే వీళ్లంతా ఒకెత్తు అయితే ప్రియాంక సింగ్ మాత్రం మరో ఎత్తు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Telugu Biggboss, Nagababu, Natraj, Priya, Priyanka Singh, Ravi, Sriram, Transgen

ప్రియాంక ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని నాగబాబు వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక ఉందనే విషయం తనకు చాలా సంతోషం కలిగించిందని నాగబాబు కామెంట్లు చేశారు.

Telugu Biggboss, Nagababu, Natraj, Priya, Priyanka Singh, Ravi, Sriram, Transgen

ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత ప్రియాంక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రియాంకకు ఛాన్సులు రాని సమయంలో ఒక షోకు సంబంధించి తాను సాయం చేశానని నాగబాబు ప్రకటించారు.ప్రియాంక విన్నర్ అయినా కాకపోయినా తన మద్దతు మాత్రం ప్రియాంకకే అని నాగబాబు వెల్లడించారు.నాగబాబు మద్దతు ఇవ్వడం ప్రియాంకకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube