బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అభిషేక్ బచ్చన్ ముంబైలో ఉన్న లగ్జరీ అపార్ట్ మెంట్ ను విక్రయించినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.లగ్జరీ అపార్ట్మెంట్ ను అభిషేక్ బచ్చన్ ఏకంగా 45.75 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు తెలుస్తోంది.7,527 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ అపార్ట్మెంట్ ను అభిషేక్ బచ్చన్ 2014 సంవత్సరంలో కొనుగోలు చేశారు.
ఆ సమయంలో అభిషేక్ 41 కోట్ల రూపాయలకు లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేయగా తక్కువ లాభానికే అపార్ట్మెంట్ ను విక్రయించడం గమనార్హం.ముంబై నగరంలోని వర్లి ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ ఉంది.37వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్ ను అభిషేక్ అకస్మాత్తుగా విక్రయించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.అదే బిల్డింగ్ లో షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లకు కూడా అపార్ట్మెంట్ లు ఉన్నాయి.
షాహిద్ కపూర్ కు ఉన్న అపార్ట్మెంట్ విలువ 56 కోట్ల రూపాయలు కాగా అక్షయ్ కుమార్ కు ఉన్న అపార్ట్మెంట్ విలువ 52.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ప్రముఖ నటీమణులు దిశాపటానీ, రాణీముఖర్జీ ఖార్ ప్రాంతంలో అపార్ట్మెంట్ లను కొనుగోలు చేశారు.మరోవైపు అభిషేక్ ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే.
అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ సినిమాలో చివరిగా నటించగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
అభిషేక్ నటించిన మరికొన్ని సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది.మరోవైపు నటి ఐశ్వర్యా రాయ్ ఫన్నీ ఖాన్ సినిమాలో చివరిగా నటించారు.పరిమితంగా ఐశ్వర్యా రాయ్ సినిమాల్లో నటిస్తుండగా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అయితే ఐశ్వర్యా రాయ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ భారీస్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.