ఆహా ప్రేక్షకులని మైమరిపించడంలో ఎప్పుడూ ముందుంటుంది.అలాగే ఈసారి కూడా ఒక సరికొత్త కథతో #బిఎఫ్ఎఫ్ రూపంలో మనందరి ముందుకు వస్తుంది.
ఆహా, డైస్ మీడియా అల్లుడు గారు తర్వాత ఈ వెబ్ సిరీస్ తో అందరిని అలరించడానికి సిద్ధమవుతున్నారు.
#బిఎఫ్ఎఫ్ కథ ప్రసుత యువత ను దృష్టిలో పెట్టుకొని తీసినది.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి స్నేహం దొరకడం చాలా కష్టం, కానీ అలాంటి ఒక స్నేహం చెంతకి చేరినపుడు, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందని సరదాగా అందరికి చూపిస్తుంది మన ఆహా.స్నేహం, బాధ్యతలు, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, కొత్త ఆఫీస్, కొత్త మనుషులు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు అద్దం పట్టినట్టు చూపించడానికి ఆహా, డైస్ మీడియా మరియు తమాడ ద్వారా మే 20 న మన ముందుకు వస్తుంది.
కొత్త వెబ్ సిరీస్ గురించి ఆహా సీఈఓ, అజిత్ కే ఠాకూర్ మాట్లాడుతూ, “ఈ కథ యువతకు సంబంధించింది.వారి ఆలోచనల ప్రవాహమే ఈ #బిఎఫ్ఎఫ్.ఈ కథ చూస్తున్నపుడు మనకు మన 20 వ ఏడు గుర్తుకొస్తుంది, ఇప్పటి యువతకు ప్రతిబింబమే ఈ వెబ్ సిరీస్.డైస్ మీడియా మరియు తమాడ ద్వారా ఈ వెబ్ సిరీస్ అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.”
కొత్తదనానికి మరో పేరైన ఆహా షోస్ ని లాంచ్ చేయడం లో తనకు తానే సాటి.ఈ సిరీస్ ని కూడా 12 మే నాడు మీడియా, తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్ మధ్యలో ఒక వాచ్ పార్టీ లో ఎయిర్ లైవ్, హైదరాబాద్ లో లాంచ్ చేసింది.తార క్యారెక్టర్ చేస్తున్న సిరి హనుమంత్ మాట్లాడుతూ, “నేను అభిమానులని కొత్తగా ఎలా అలరించాలని ఆలోచిస్తూ ఉంటాను.
అలాంటి సమయంలో నాకు తార పాత్ర వచ్చింది.ఇది అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.” నిత్య పాత్ర పోషిస్తున్న రమ్య పసుపులేటి మాట్లాడుతూ, “ఈ షో ద్వార నేను ఎంతో నేర్చుకున్నాను.ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాల సంతోషంగా ఉన్నాను.నిత్య పాత్ర అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.”జీవితం, స్నేహం, ఇంకా ఎన్నో అద్భుత కథల సమ్మేళనమే ఈ #బీఎఫ్ఎఫ్.మే 20 న ఆహాలో తప్పక చూడండి