సోషల్ మీడియా( Social media )లో అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.కొంతమంది పాపులర్ అయ్యేందుకు రకరకాల స్టంట్లు, విన్యాసాలు చేస్తూ ఉంటారు.
ప్రాణాంతమైక జీవులతో చెలగాటం ఆడుతూ ఆశ్చర్యం కలిగించే పనులు చేస్తూ ఉంటారు.తాజాగా ఒక యువతి విషసర్పాలతో సాహాసం చేసింది.
రెండు పాములను రెండు చేతులతో పట్టుకుని తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.ఈ వీడియో చూడటానికి భయంకరంగా ఉండగా.
యువతి ధైర్యానికి అందరూ హ్యాట్సఫ్ చెబుతున్నారు.
పాము( Snake )ను చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది.వెంటనే అక్కడ నుంచి పరుగులు తీయడం చేస్తూ ఉంటారు.కొంత ధైర్యం కలిగినవారు అయితే పామును చంపడానికి ప్రయత్నం చేస్తారు.
కానీ ఈ యువతి మాత్రం ఎంత విష పాములైనా తనకు భయం లేదనేలా సాహాసం చేసింది.యువతి పెరట్లోకి రెండు పాములు వచ్చాయి.దీంతో ఈ రెండు పాములను యువతి పట్టుకుంది.ఒకేసారి రెండు చేతులతో రెండు పాములను పట్టుకుంది.
దీనిని కుటుంబసభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.దీంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వామ్మో.ఈ యువతికి ఎంత ధైర్యమో అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ వీడియో మాత్రం వైరల్ గా మారింది.యువతి ధైర్యాన్ని చూసి అందరూ హ్యాట్సఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఈ వీడియోను చూస్తే.పెరట్లో చిన్న డ్రైన్ లాంటిది ఉండగా.దాని పక్కన రెండు పాములు మెలికవేసుకుని ఉన్నాయి.యువతి వాటి దగ్గరకు వెళ్లి రెండు చేతులతో రెండు పాములను పట్టేసుకుంది.
ఒక పాము తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.దానిని కూడా పట్టుకుంది.
అనంతరం ఆ రెండు పాములను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేసింది.పాములు బుస కొడుతున్నా యువతి బెదరలేదు.
ధైర్యంతో వాటిని పట్టుకుంది.