కారు నుంచి కాంగ్రెస్ లోకి యువనేత..హుజురాబాద్ లో త్రిముఖ పోరు తప్పదా..?

హుజురాబాద్( Huzurabad ) నియోజకవర్గం  ఈ పేరు చెప్తేనే  అందరికీ గుర్తుకు వచ్చేది ఈటల రాజేందర్.గత కొన్ని పర్యాయాల నుంచి ఆయనే  హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

 A Young Leader From A Brs To Congress Is It A Three-way Fight In Hujurabad , S-TeluguStop.com

ఈటలకు ఎంతో పట్టున్న హుజురాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది.అయితే రెండు పర్యాయాలు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్( Etela rajendar ),  ఆ తర్వాత బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి నుంచి పోటీ చేసి  మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దీంతో అక్కడ  చాలామంది బీఆర్ఎస్ నాయకులు  ఈటల రాజేందర్ తో బిజెపిలోకి వెళ్లలేక పోయారు.అంతేకాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బలంగానే ఉంది.

అంతకుముందు రెండు పర్యాయాలు  కాంగ్రెస్ నుంచి పోటీ చేసి  కొద్దిపాటి  తక్కువ ఓట్లతో ఈటల మీద  కౌశిక్ రెడ్డి ( Kowshik reddy )  ఓడిపోయారు.

Telugu Congress, Etela Rajendar, Huzurabad, Kowshik Reddy, Sathishkumar-Politics

ఆ తర్వాత ఈటల బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో  కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లారు.ఈసారి ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ టికెట్టు పాడి కౌశిక్ రెడ్డి కేటాయించారు కేసీఆర్( Kcr ).ఇక్కడే అసలు తప్పిదం జరిగింది.హుజురాబాద్ నియోజకవర్గంలో  గత మూడు దశాబ్దాల నుంచి ఎంతో పట్టు ఉన్నటువంటి ఒడితల కుటుంబంలో ఒడితల ప్రణవ్ బాబు( pranav babu ),  బీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ ఆశించారు.కానీ అధిష్టానం మాత్రం కౌశిక్ రెడ్డికి( kowshik reddy ) కేటాయించడంతో  ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రణవ్ బాబు  బంగపడ్డారు.

దీంతో ఎలాగైనా ఈసారి పోటీ చేయాలని భావించి  అక్కడ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖార్గే( Mallikarjuna kharge ), రేవంత్ రెడ్డి( Revanth reddy ) ఆధ్వర్యంలో  పార్టీ కండువా కప్పుకున్నారు.

Telugu Congress, Etela Rajendar, Huzurabad, Kowshik Reddy, Sathishkumar-Politics

దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు హుజురాబాద్ టికెట్ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.  ప్రణవ్ బాబు( Pranavbabu ) కుటుంబీకులైన  కెప్టెన్ లక్ష్మీ కాంతారావు( Laxmi kantharao ), మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్( Sathish kumar )  కీలక నేతలుగా, కేసీఆర్ కు( Kcr ) సన్నిహితులుగా ఉన్నారు.

ఇదే తరుణంలో అదే కుటుంబం నుంచి బలమైన నేత అయినటువంటి ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో  అందరూ షాక్ అయ్యారు.తప్పనిసరిగా హుజురాబాద్ లో ప్రణవ్ బాబుకు మద్దతు లభిస్తుందని, గెలుపు తీరాలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎందుకంటే ప్రణవ్ బాబు తాత సింగాపురం రాజేశ్వరరావు( Rajeshwarrao )  ఒకప్పుడు హుజురాబాద్ లో  ఒకప్పుడు ఎన్నో సేవలందించి, కీలక నేతగా ఎదిగారు.  వారి కుటుంబం నుంచి ఎంతోమంది ప్రజలు సహాయ సహకారాలు అందుకున్నారు.

ఇదే తరుణంలో ప్రణవ్ బాబు కాంగ్రెస్ లో చేరడంతో  పాత ఊపు మళ్ళీ వస్తుందని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అంతేకాకుండా  బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి,  అలాగే బిజెపిలో ఉన్న ఈటల రాజేందర్  అందరూ బలమైన నేతలు కావడంతో ఈసారి హుజురాబాద్ లో త్రిముఖ పోరు గట్టిగానే జరిగేటట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube