కాంగ్రెస్ కు అతనితోనే ప్రాబ్లమా ?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ఏ స్థాయిలో సతమతమౌతుందో అందరికీ తెలిసిందే.పార్టీకి అండగా ఉండాల్సిన సీనియర్లు ఆదిపత్య పోరులో పార్టీని పట్టించుకోవడమే మానేశారు.

 A Threat To Congress With Komati Reddy, Komatireddy Venkat Reddy , Congress, Kom-TeluguStop.com

మరోవైపు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నేతలందరిని కలుపుకోవడంలో విఫలం అవుతున్నారు.ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలు రోజు రోజుకు రాష్ట్రంలో బలం పెంచుకుంటున్నాయి.

ఇలా కాంగ్రెస్ ను శతవిధాల సమస్యలు చుట్టుముడుతున్నాయి.ఇవి చాలదు అన్నట్లుగా కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తరచూ తలనొప్పిగానే ఉంది.

Telugu Congress, Komatiraj, Komativenkat, Revanth Reddy, Ts-Latest News - Telugu

మునుగోడు ఎన్నికల సమయంలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) కాంగ్రెస్ కు రాజీనామా చేసినది మొదలుకొని ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ వార్తల్లోనే నిలుస్తున్నారు.మునుగోడు ఎన్నికల టైమ్ లోనే వెంకటరెడ్డి హస్తం పార్టీ వీడే అవకాశం ఉందనే వార్తలు అప్పుడు బలంగా వినిపించాయి.అయితే ఆ వార్తలను కొట్టి పారేస్తూ తనది కాంగ్రెస్ రక్తమని.రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ తోనే ఉంటానని వెంకటరెడ్డి అప్పుడే స్పష్టం చేశారు.అయితే హస్తం పార్టీలో ఉంటూనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని, వెంకటరెడ్డి కోవర్ట్ రాజకీయలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు.

Telugu Congress, Komatiraj, Komativenkat, Revanth Reddy, Ts-Latest News - Telugu

పార్టీలో ఉంటే ఉండు లేదా పార్టీకి రాజీనామా చెయ్ అన్న రీతిలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) పై ఫైర్ అయ్యారు.అయితే తను పార్టీ వీడేది లేదని మీరే సస్పెండ్ చేస్తే చేయండి అంటూ తానకు మాత్రం పార్టీ వీడే ఆలోచన లేదని ఎప్పటికప్పుడు స్పస్టం చేస్తూనే వచ్చారు.ఇక తాజాగా మరోసారి కోమటిరెడ్డి పార్టీ మార్పు పై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి స్పస్టం చేశారు.

కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదని వెల్లడించారు.అయితే కోమటిరెడ్డి పార్టీలో ఉండడం వల్ల అసలు సమస్యలు వస్తున్నాయని, ఆయన బిజెపి కోవర్ట్ గా పని చేస్తున్నారని కొంతమంది హస్తం నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యవహారం ఇలాగే కొనసాగితే.కాంగ్రెస్ మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube