రాజుల ఇళ్లల్లో అయినా బల్లులు( Lizards ) ఖచ్చితంగా కనిపిస్తాయనే సామెత ఉంది.ఇది నిజం.
ఎన్ని చిట్కాలు పాటించినా, ఇళ్లలో ఎక్కడో ఒక చోట బల్లులు కనిపిస్తాయి.ఇలాంటి బల్లుల్లో ఓ రకానికి చెందినది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేకత కలిగి ఉంది.
గిక్కో( Gikko ) అనే అరుదైన బల్లికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది.ఇది ఎక్కువగా బీహార్( Bihar )లో లభిస్తోంది.
భారత్‌లోనే దీనికి దాదాపు రూ.కోటి ధర పలుకుతోంది.అదే అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి రూ.కోటిన్నర ధర వస్తుంది.బీహార్ లోని పూర్నియా జిల్లాలో ఇలాంటి బల్లులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను పోలీసులు తరచూ పట్టుకుంటున్నారు.ఈ బల్లిని టోకే గయో అని కూడా పిలుస్తారు.ఇటీవల ఈ బల్లితో పాటు, పూర్నియా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.బల్లిని అక్రమ రవాణా కోసం ఢిల్లీకి నిందితులు తీసుకెళ్లారు.
రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు ఈ బల్లిని డ్రగ్ స్టోర్ నుండి స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని కరండిహి ప్రాంతంలో కూడా ఈ బల్లి లభిస్తుంది.దీంతో బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కొందరు స్మగ్లింగ్ ముఠాలు ఈ గెక్కో లిజార్డ్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు.ఈ బల్లిని పురుషత్వం పెంచే మందుల తయారీలో ఉపయోగిస్తారు.
అంతేకాకుండా నపుంసకత్వము, డయాబెటిస్, ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధులను తగ్గించేందుకు ఉత్పత్తి చేసే మందులను ఈ బల్లి మాంసం నుంచి తయారు చేస్తారు.గెక్కో అనేది అరుదైన బల్లి.
ఈ బల్లులు ఆగ్నేయ ఆసియా, బీహార్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఈశాన్య భారతదేశం, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో కనిపిస్తాయి.తరచూ అడవులలో చెట్లు కొట్టేయడం, అడవులు అంతరిస్తుండడంతో ఈ బల్లులు కూడా అంతరించిపోతున్న జాబితాలో చేరిపోయాయి.