వీడియో వైరల్: జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలంటూ ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు.. చివరకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP ) టిడిపి కూటమి చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో వైఎస్ఆర్సిపి పార్టీ పోటీలోకి దిగగా అందులో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.

 A Man Tried To Jump Into The River With His Family Due To Ys Jagan Loss In The E-TeluguStop.com

టిడిపి కూటమి 164 స్థానాలతో విజయం సాధించి మరోసారి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ముఖ్యమంత్రి అధిష్టానం చేపట్టబోతున్నారు.అయితే వైఎస్ఆర్సిపి అభిమానులు కొందరు ఆ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడం కారణాలు ఇప్పటికి అంచనా వేయలేకపోతున్నారు.

ఇందులో కొందరు ఏకంగా విచారణ చేర్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అధిక ఓట్లు సంపాదించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి( Jaganmohan Reddy ) ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలంటూ వ్యక్తి డిమాండ్ చేస్తూ తన ఫ్యామిలీతో కొవ్వూరు( Kovvuru ) గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలోకి దూకేందుకు ప్రయత్నం చేశాడు.బ్రాహ్మణగూడెం చెందిన ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో అక్కడి చేరుకొని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులు అధికారులు వస్తే తాను నదిలో దూకేస్తానంటూ హల్చల్ చేశాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అతనికి నచ్చచెప్పి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్( EVM Tampering ) ఉందని అతడు ఈ వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ అభిమాని రాజు( Raju ) తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

అలా చేయకపోతే తాను రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారని హల్చల్ చేశాడు.ఇప్పటికిప్పుడు మళ్లీ తమ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరపాలంటూ., అలాగే ఈవీఎం ద్వారా కాకుండా కేవలం బ్యాలెట్ పత్రాల ద్వారా మాత్రమే ఎలక్షన్స్ జరపాలని అతడు కోరాడు.ఇక చివరిగా పోలీసులు రాజు అనే వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube