ఇజ్రాయెల్.హమాస్( Hamas ) మిలిటెంట్ ల మధ్య భారీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 7 నుండి మొదలైన ఈ యుద్ధం ఉన్న కొద్ది తీవ్రతరంగా మారుతోంది.ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కి అమెరికా, యూకే, యూరప్ దేశాలు అదేవిధంగా భారత్( India ) మద్దతు తెలపడం జరిగాయి.
మరోపక్క ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అరబ్ దేశాలతో పాటు చైనా, రష్యా ఏకమవుతున్నాయి.కాగా ఇజ్రాయెల్.
హమాస్ మిలిటెంట్ ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎక్కువగా సామాన్యులు బలైపోతున్నారు.ఇప్పటికే గాజాలో( Gaza ) పరిస్థితులు చాలా అధ్వానంగా మారాయి.
నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
పరిస్థితి ఇలా ఉంటే గాజాలో హమాస్ మిలిటెంట్ నాయకులు తలదాచుకుంటున్న పెద్ద పెద్ద భవనాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వేటాడి వెంటాడుతూ మట్టు పెడుతున్నాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం గాజాలో మసీదులో భారీ పేలుడు జరిగిందంట.ఈ పేలుడులో పదిమంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.మరోపక్క హమాస్ మిలిటెంట్ ల వద్ద బందీలుగా ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.మొత్తం 200 మంది బందీలుగా ఉన్న వారిని రక్షించడానికి ఇజ్రాయెల్ బలగాలు గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టనున్నాయి.