కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు 12 వేల కి.మీ ప్రయాణించిన ఫ్యాన్.. చివరికి షాక్?

ఆదివారం లక్నోలో ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ( Virat Kohli )డక్ ఔట్ అయిన సంగతి తెలిసిందే.కోహ్లీ కెరీర్ మొత్తంలో చూసుకుంటే ప్రపంచకప్‌లో ఇదే తొలిసారి అతడు డక్ ఔట్ కావడం.

 A Fan Who Traveled 12,000 Km To Watch Kohli Bat Shocked At The End , Icc World C-TeluguStop.com

ఈ మ్యాచ్ లో బాగా రాణిస్తాడని అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.కానీ సున్నాకే వెను తిరగడంతో అభిమానులు షాక్, నిరాశకు గురయ్యారు.

అతను ఈ మ్యాచ్‌కు ముందు గొప్ప ఫామ్‌లో ఉన్నాడు, టోర్నీలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు చేశాడు.

దాంతో అతడు ఈ ఆదివారం బాగా ఆడతాడు అని అందరూ భావించారు కానీ కింగ్ కోహ్లీ మాత్రం ఫెయిల్ అయ్యాడు.దీన్ని చూసి చాలామంది షాక్ అయ్యారు ముఖ్యంగా ఓ అభిమాని గుండెలు బాదుకున్నాడు.ఎందుకంటే సదరు ఫ్యాన్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమెరికా నుంచి లక్నో వరకు 12,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.“G.O.A.T కింగ్ కోహ్లిని చూసేందుకు యూఎస్ నుంచి 7732 మైళ్ళు ట్రావెల్ చేశా.” అనే పోస్టర్ పట్టుకొని అతడి స్టేడియంలో కనిపించాడు.అయితే తొలి ఓవర్‌లోనే కోహ్లి తన వికెట్‌ను RCB సహచరుడు డేవిడ్ విల్లీ( David Willey )కి ఇవ్వడంతో అతని ఆశలు అడియాసలయ్యాయి.

ఈ అభిమాని పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.చాలా మంది అతనిపై జాలిపడుతున్నారు.ప్రపంచకప్‌లో కోహ్లీ పరుగులేమీ చేయలేకపోయిన అరుదైన రోజు ఇది.ఈ ఔట్‌తో కోహ్లి కూడా కలత చెందాడు.కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లోని సోఫాను కొట్టాడు, దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.అయితే అంతిమంగా ఆదివారం కోహ్లికి, అతని అభిమానులకు విజయాన్ని మిగిల్చింది.ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌లో నెం.1 జట్టుగా అవతరించింది.తమ జట్టు రాణించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం పట్ల కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.అతను, అతని అభిమానులు భారతదేశం విజయం, టోర్నమెంట్‌లో వారి విజయాల పరంపరను సెలబ్రేట్ చేసుకున్నారు.

Kohli Fan Travelled 12,000km to Watch

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube