ఏడుస్తున్న చెల్లిని ఓదార్చిన బాలుడు.. వీడియో వైరల్

అన్నా చెల్లెల అనుబంధం ప్రత్యేకమైనది.చిన్న వయసులో పిల్లలు ఎవరైనా తమ చెల్లికి దెబ్బ తగిలితే అల్లాడిపోతారు.

 A Boy Who Consoled A Crying Sister The Video Is Viral , Sister Crying, Viral La-TeluguStop.com

తమకే దెబ్బ తగిలిందనే రీతిలో బాధపడతారు.చెల్లెలిని ఓదార్చి, తమ సోదర ప్రేమను కురిపిస్తారు.

అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ ఎవరి కుటుంబ బాధ్యతల్లో వారు బిజీ అయిపోతారు.అయితే అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఇసుమంతైనా తరగదు.

ఇలా అన్నాచెల్లెలి మధ్య జరిగిన ఓ హత్తుకునే సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఏడుస్తున్న చెల్లెలిని హత్తుకుని, అన్న ఓదార్చిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

పిల్లల్లో అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది.

అయినప్పటికీ వారి ప్రవర్తన ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తుంది.ముఖ్యంగా చెల్లెళ్ల విషయంలో అన్నలు ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది.

చెల్లెలికి ఏ కష్టం రాకుండా చూసుకునే అన్నల తాపత్రయం ఎంతో హృద్యంగా ఉంటుంది.ఇక ఇదే తరహాలో ట్విట్టర్‌లో ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ అయింది.అందులో ఓ నెట్‌లో బాస్కెట్ బాల్ వేసేందుకు ఓ చిన్నారి ప్రయత్నిస్తుంది.

అయితే విఫలం కావడంతో ఒక్కసారిగా ఏడవడం ప్రారంభిస్తుంది.అది చూసిన ఆమె అన్న అక్కడకు వస్తాడు.

ఆ బాలికను ఓదార్చుతాడు.బాలిక ఎత్తు తక్కువగా ఉందని తెలుసుకుంటాడు.

వెంటనే ఆ బాల్ తెచ్చి చెల్లెలి చేతిలో పెడతాడు.తన చెల్లిని ఎత్తుకోగానే ఆ చిన్నారి నెట్‌లో బాస్కెట్ బాల్ విజయవంతంగా వేసేస్తుంది.

చెల్లెలిని గెలిపించేందుకు, ఆమె ఏడవకుండా ఆపేందుకు ఆ చిన్ని బాలుడు అలా చేశాడు.వారిద్దరి మధ్య అనుబంధం ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

ఆ చిన్నారి బాబును నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube