కాబూల్ ఎయిర్‌పోర్టులో వాట‌ర్ బాటిల్ రూ.3వేలు.. భోజనం ఎంతో తెలిస్తే..

ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ ను చూస్తుంటే ఎవ‌రికైనా కంటి నిండా నీళ్లు రావాల్సిందే.కాగా ఇ్ప‌టికే ఈ దేశంలో తాలిబ‌న్లు చూపిస్తున్న అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు.

 A Bottle Of Water Costs Rs 3,000 At Kabul Airport Kabul Airport, Talibans , Wat-TeluguStop.com

ఇక కాబూల్ ఎయిర్ పోర్టుల్లో వీరు చేస్తున్న అరాచ‌కాలు చూస్తుంటే మాత్రం గుండెలు త‌రుక్కుపోతున్నాయి.ఎందుకంటే ఇక్క‌డ ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఇక సామాన్య జ‌నం అయితే ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపిస్తే ఏకంగా కిడ్నాప్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.ఇంక తిర‌గ‌బ‌డిన వారిమీద అయితే అక్క‌డిక‌క్క‌డే దారునంగా దాడులకు తెగబడుతున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇంకోవైపు కాబూల్‌లో ఉక్రెయిన్ కు చెందిన ఫ్లైట్ ఒక్క‌టి విమానం హైజాక్ కావ‌డాన్ని చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయో ప‌రిస్థితులు అర్థ‌మ‌వుతున్నాయి.నిజానికి తాలిబ‌న్లు మీద‌కు శాంతి వచనాలు చెబుతున్నా కూడా ఆ దేశంలో వారు విధ్వంసాలకు పాల్పడుతున్నారు.

ప్ర‌జ‌ల్ని లేదంటే మ‌హిళ‌ల్ని చూస్తే చాలాఉ పిచ్చెక్కిన కోతుల్లా రెచ్చిపోతున్నారు.మ‌రీ ముఖ్యంగా తాలిబ‌న్ల అరాచ‌కాల‌ను చూస్తుంటే మాత్రం కాబూల్ ఎయిర్‌పోర్టు అఫ్ఘాన్ పౌరులు ఎన్ని చిత్ర హింస‌లు ప‌డుతున్నారో అర్థం అవుతుంది.

Telugu Bottle, Afghanistan, Kabul Airport, Talibans, Rs-Latest News - Telugu

అయితే ఈ కాబూల్ ఎయిర్ పోర్టులో తాగేందుకు మంచి నీటిని కూడా చాలా దారుణంగా మార్చేస్తున్నారు తాలిబ‌న్లు.ఎంతలా అంటే క‌నీసం జ‌నాల‌కు తాగునీరు కూడా దొర‌క‌కుండా చేయాల‌నే ఉద్ధేశ్యంతో తాగునీటిని, ఆహారాన్ని అత్యంత ఎక్కువ‌గా ధ‌ర‌ల‌కు అమ్మేస్తున్నారు.ఒక్క లీట‌ర్ నీళ్ల బాటిల్ ఏకంగా మ‌న క‌రెన్సీలో అయితే రూ.3వేలుగా నిర్ణయించి అమ్ముతున్నారు.ఒక్క ప్లేట్ అన్నం అయితే రూ.7,500 అమ్మ‌డాన్ని చూస‌త్ఉంటే ఎంత దారుణంగా ప‌రిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక వీటిని కూడా అప్ఘానిస్తాన్ కరెన్సీలో కాకుండా డాలర్ల రూపంలో అమ్ముతున్నారు.దీంతో ఆఫ్ఘాన్ ప్ర‌జ‌లు డ‌బ్బులు ఉన్నా కూడా వీటిని కొన‌లేని ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube