దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో “అమ్మ రాజీనామా” చిత్రంతో రాజ్ కుమార్ అనే ఒక కొత్త నటుడు అప్పట్లో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.ఇతగాడు చిరంజీవి పొలికలతో ఉండటంతో.
చిరంజీవికి డూప్ గా బాగా పనికోస్తాడు అనుకున్నారు.కట్ చేస్తే మనోడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు .సెకండ్ హీరో పోస్ట్ లకు మాత్రం పరిమితం అయ్యాడు.సినిమాల్లో కంటే బుల్లి తెర బెటర్ అనుకుని.
అక్కడే పలు సీరియల్స్ లో హీరో గా చేశాడు.అయితే ఈ మధ్య రాజకుమార్ భార్య ఇతగాడిని మళ్లీ సినిమాల్లో హీరోగా చూడాలనుకుందట.
అంతే.తనే ప్రొడ్యూసర్ గా “బారిష్టర్ శంకర్ నారాయణ “చిత్రం రెడీ అయ్యింది.
అలనాటి సీనియర్ కొరియోగ్రఫర్ తార ఈ సినిమా డైరెక్ట్ చేశారు.ఈ సినిమా ఆడియో విడుదల జరిగింది.
ఈ నెల 14 న ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు .నిర్మాత , హీరో రాజ్ కుమార్ చెప్పారు.మరి భర్తను .చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై చూడాలని భార్య నిర్మించిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.