నాగచైతన్య( Nagachaitanya ) సాయి పల్లవి ( Sai Pallavi ) తాజాగా నటించిన చిత్రం తండేల్ ( Thandel ).డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే ఏకంగా బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తుంది.ఇక ఈ సినిమా తమిళం హిందీ భాషలలో విడుదలైనప్పటికీ అక్కడ నాగచైతన్యకు పెద్దగా మార్కెట్ లేకపోవడంతో అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక తెలుగులో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

నాగచైతన్య ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ అలాగే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా తమిళ వర్షన్ లో ఈ సినిమాని హీరో ధనుష్ అలాగే కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చూశారట ఈ సినిమా చూసిన అనంతరం నాగచైతన్యకు స్వయంగా ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందని అభినందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ధనుష్( Dhanush ) ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం.

తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్( Tamil Remake ) చేయాలనే ఆలోచనలో ఉన్నారట.అయితే హీరోగా ధనుష్ నటించగా హీరోయిన్గా సాయి పల్లవి మాత్రం నటించరని తెలుస్తుంది.గతంలో కూడా చిరంజీవి భోళా శంకర్ రీమేక్ సినిమాలో నటించడం కోసం ఈమెను సంప్రదిస్తే రీమేక్ సినిమా కావడంతో తాను నటించనని తెలిపారు.దీంతో తమిళ వెర్షన్ తండేల్ నిమాలో ఈమె నటించదని స్పష్టమవుతుంది.
ఈ క్రమంలోనే కృతి శెట్టిని( Krithi Shetty ) హిరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమా తమిళ రీమెక్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి.