మధ్యప్రదేశ్‌లో దారుణం.. పెళ్లైన రాత్రే వధువుకు కన్యత్వ పరీక్ష.. చివరకు?

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, ఇండోర్‌ సిటీలో ఒక భయంకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పెళ్లైన రాత్రే ఓ మహిళను కన్యత్వ పరీక్ష చేయించుకోవాల్సిందిగా అత్తింటి వారు బలవంతపెట్టారు.

 Atrocity In Madhya Pradesh.. Bride's Virginity Test On The Wedding Night.. Final-TeluguStop.com

ఈ విషయం చివరకు కోర్టు దృష్టికి వచ్చింది, ఈ ఘటన గురించి తెలుసుకొని న్యాయమూర్తి కూడా షాక్ అయ్యారు.అంతేకాదు, ఆమె అత్తమామలపై ఎఫ్ఐఆర్ (FRI)నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

బాధితురాలు బంగాంగా ప్రాంతానికి చెందిన మహిళ కాగా, 2019, డిసెంబర్‌లో భోపాల్‌కు చెందిన వ్యక్తితో పెండ్లి జరిగింది.పెళ్లైన మొదటి రాత్రి తనను కన్యత్వ పరీక్ష (Virginity test)పేరుతో చిత్రహింసలకు గురి చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన శారీరక, మానసిక వేదనకు గురయ్యానని ఆమె ఆరోపించింది.

వివాహం జరిగినప్పటి నుంచి ఆమె అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయట.ఆమె అత్త నిత్యం ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ, ఇతరులతో సంబంధాలు ఉన్నాయని నిందించేది.అంతేకాకుండా, కట్నంగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Telugu Dna Baby, Domestic Abuse, Dowry, Indore, Trauma, Physical Trauma, Virgini

కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది.కానీ, నిరంతర వేధింపులు, నిందల కారణంగా గర్భస్రావం(Miscarriage) జరిగింది.ఆ తర్వాత, మళ్లీ గర్భం దాల్చగా, పుట్టిన బిడ్డ మరణించింది.దీనితో ఆగని అత్త, మరణించిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష(DNA test for the baby) చేయించాలని డిమాండ్ చేసింది.

ఆమెకు మళ్లీ గర్భం రాగా ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్ల పుట్టిందనే కోపంతో, ఆమెను పుట్టింటికి పంపేశారు.

Telugu Dna Baby, Domestic Abuse, Dowry, Indore, Trauma, Physical Trauma, Virgini

చివరికి, బాధితురాలు జనవరి 18న ఇండోర్ జిల్లా, సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేసింది.మహిళా, శిశు అభివృద్ధి శాఖ నుంచి రహస్య నివేదికను కోర్టు స్వీకరించింది.ఆ నివేదికలో, అత్తమామలు పెళ్లైన రాత్రి కన్యత్వ పరీక్ష పేరుతో ఆమెను తీవ్రంగా అవమానించారని, చిత్రహింసలకు గురి చేశారని తేలింది.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది.

ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube