కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ సిటీలో (Palakkad City, Kerala State)ఉన్న అనక్కర గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది.11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, స్కూల్ రూల్స్‌ను బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ (Mobile phone)వాడుతూ పట్టుబడ్డాడు.దీంతో ఆ విద్యార్థి ఫోన్‌ను టీచర్ లాక్కున్నారు.ఆగ్రహించిన విద్యార్థి ఏకంగా టీచర్ ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
స్కూల్ నిబంధనల ప్రకారం క్లాసులో ఫోన్ వాడకూడదు.
అయినా లెక్కచేయకుండా ఆ స్టూడెంట్ ఫోన్(Student phone) వాడుతూ దొరికిపోయాడు.ఆ టీచర్ వెంటనే ఫోన్‌ను తీసుకుని ప్రిన్సిపాల్‌కు ఇచ్చారు.
దీంతో కోపం కట్టలు తెంచుకున్న విద్యార్థి, ప్రిన్సిపాల్(Student, Principal) ఆఫీస్‌కి వెళ్లి తన ఫోన్ తిరిగి ఇవ్వమని గొడవ చేశాడు.టీచర్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో విద్యార్థి మరింత రెచ్చిపోయాడు.
టీచర్‌పై అరుస్తూ, బయటకు వస్తే చంపేస్తానంటూ బెదిరించాడు.
దీంతో భయపడిపోయిన టీచర్లు, పేరెంట్-టీచర్ అసోసియేషన్ (PTA) కలిసి త్రిథాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.అయితే, టీచర్లు మాత్రం ఇంకా వ్యక్తిగతంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఈ ఘటనతో స్కూల్‌లో విద్యార్థుల ప్రవర్తన, టీచర్ల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.టీచర్లను దుర్భాషలాడుతూ, బెదిరిస్తున్న వీడియో చూసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు.స్కూల్ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలనే చర్చలు మొదలయ్యాయి.ఈ ఘటనతో విద్యార్థిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు.
స్కూల్‌లో ఫోన్ వాడకూడదనే నిబంధన పెట్టడానికి కారణం, విద్యార్థుల్లో క్రమశిక్షణను తీసుకురావడమే.
కానీ, ఈ సంఘటన చూస్తుంటే, రూల్స్‌ను ధిక్కరించే విద్యార్థులను టీచర్లు ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒక పెద్ద సమస్యగా మారింది.