యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినీ కెరీర్ లో ఒడిదొడుకులు ఎక్కువనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత 2004 సంవత్సరంలో ఆంధ్రావాలా( Andhrawala ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.2004 సంవత్సరం జనవరి 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేదనే చెప్పాలి.
2004 సంవత్సరంలోనే తారక్ నటించిన సాంబ సినిమా( Samba Movie ) కూడా విడుదలైంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.2014 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస మూవీ( Rabhasa Movie ) విడుదలైంది.ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.

2004, 2014 సంవత్సరాలు తారక్ కు కలిసిరాకపోవడంతో 2024 సంవత్సరంలో ఏం జరుగుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.ఈ ఏడాది తారక్ నటించిన దేవర సినిమా( Devara Movie ) విడుదలై ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దేవర సినిమా సక్సెస్ ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి.
తారక్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ సైతం అద్భుతంగా ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా సినిమాకు లుక్స్ కు సంబంధించి వేరియేషన్ చూపిస్తున్నారు.తారక్ ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తున్నారు.ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ అన్నీ భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.వరుస పాన్ ఇండియా సినిమాలు తారక్ మార్కెట్ ను మరింత పెంచాలని అభిమానులు ఫీలవుతున్నారు.