పుష్ప2 మూవీకి దేవిశ్రీని తప్పించడానికి మరో డైరెక్టర్ కారణమా.. అసలు ట్విస్ట్ ఇదేనా?

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటిస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సంబంధించిన గత కొద్ది రోజులుగా అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 A Director Behind Bunnys Decision Details, Pushpa 2, Allu Arjun, Devisri Prasad,-TeluguStop.com

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Allu Arjun, Devisri Prasad, Sukumar, Pushpa, Pushpa Music, Pushpa Rule, T

అదేమిటంటే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్( Devisri Prasad ) మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు మరొక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ని( Thaman ) కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ ను ఈ సినిమా నుంచి తప్పించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ నిర్ణయం దర్శకుడు సుకుమార్( Sukumar ) తీసుకోలేదు.హీరో బన్నీ తీసుకున్నారట.పుష్ప 2 ఫస్ట్ పార్ట్ లాక్ చేసి ఆర్ఆర్ కు ఇచ్చేసారు.అది తన దగ్గర పెట్టుకుని, వర్క్ చేయకుండా దేవీ తన స్టేజ్ షో ల మీదకు వెళ్లడం అన్నది హీరో బన్నీ కోపానికి కారణం అయింది.

Telugu Allu Arjun, Devisri Prasad, Sukumar, Pushpa, Pushpa Music, Pushpa Rule, T

అదే సమయంలో అల్లు అర్జున్ తో సన్నిహితంగా ఉన్న దర్శకుడు ఒకరు దీనిని మరింత ఎగ తోసారనే గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.షో లు ముఖ్యంగా మీ సినిమా ముఖ్యమా అనే విధంగా ఎగదోయడం, అదే టైమ్ లో సినిమా రిలీజ్ టెన్షన్ వుండడంతో హీరో కి ఆ మాటలు బాగా ఎక్కేసినట్లున్నాయి.దీంతో ఆర్అర్ వర్క్ వేరే ముగ్గురు సంగీత దర్శకులకు అప్పగించేలా ఏర్పాటు జరిగిపోయింది.అయితే ఇక్కడ సుకుమార్ కూడా దేవీని వెనకేసుకు రాలేని పరిస్థితి.నిజానికి ఇది అంత అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు.కొన్ని రోజులుగా నడుస్తోందట.

ఈ సంగతి తెలిసి దేవీశ్రీ ప్రసాద్ వచ్చి నేరుగా సుకుమార్ ను కలిసి మాట్లాడి వెళ్లినట్లు తెలుస్తోంది.కానీ సుకుమార్ తన అసక్తత వ్యక్తం చేయడంతో మాట్లాడకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది.

మరి ఇందులో నిజా నిజాల గురించి తెలియాలి అంటే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube