ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో( Lokesh Kanagaraj ) ఒక్క సినిమా అయినా చేయాలని ఇండియాలోని టాప్ హీరోలందరూ కోరుకుంటున్నారు.అంతేకాదు నిర్మాతలు అతని సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఎగబడుతున్నారు.
ఎందుకంటే ఈ డైరెక్టర్ తీసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ వస్తోంది.అంతేకాదు భారీ ప్రాఫిట్స్ అందిస్తోంది.
ఈ దర్శకుడు యాక్షన్ సినిమాలతో పాటు ఫాంటసీ, కామెడీ చిత్రాలు కూడా తీస్తాడు.మార్టిన్ స్కోర్సెస్, క్వెంటిన్ టరాన్టినో వంటి దర్శకుల ఫిలిం మేకింగ్ స్టైల్ ఫాలో అవుతూ భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంటాడు.
అయితే ఇంత మంచి టాలెంట్ ఉన్నా కూడా ఈ దర్శకుడిని ముందుగా ఎవరూ నమ్మలేదు.తమిళంలో S.R.ప్రభు అనే ప్రొడ్యూసర్ మాత్రమే అతనికి ఛాన్స్ ఇచ్చాడు.దాంతో ఈ హీరో “మానగరం” మూవీ( Maanagaram Movie ) చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.ఈ సినిమా రూ.40 కోట్లు పెట్టి తీస్తే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.ఇందులో సందీప్ కిషన్( Sundeep Kishan ) కూడా నటించాడు.అతని టాలెంట్ కి సందీప్ బాగా ఫిదా అయ్యాడు.నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ దొరకకపోవడంతో సందీప్ స్వయంగా లోకేష్ కోసం నిర్మాతను వెతకడం ప్రారంభించాడు.టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలందరినీ కలిసి లోకేష్ చాలా ప్రతిభవంతుడు అతనితో కలిసి ఒక సినిమా తీయొచ్చు అని చెప్పి చూశాడు.
కానీ ఎవరూ కూడా లోకేష్ కనగరాజ్ టాలెంట్‌ను నమ్మలేదు.అతన్ని గుడ్డు మీద ఈకలా తీసి పడేశారు.
ఇక తెలుగులో ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమా చేయడానికి ముందుకు రాడు అని లోకేష్ భావించాడు.దాని తర్వాత మళ్లీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.కొద్ది రోజుల కష్టపడిన తర్వాత ఈ దర్శకుడి సినిమాను మళ్లీ S.R.ప్రభునే నిర్మించడానికి ముందుకు వచ్చారు.దాంతో లోకేష్ ఖైదీ (2019)( Khaidi ) అనే తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసి మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ మూవీ రూ.25 కోట్లతో తీస్తే రూ.105 కోట్లు వసూలు చేసింది.ఈ సక్సెస్ చూసిన తర్వాత టాలీవుడ్ ప్రొడ్యూసర్లు షాక్ అయ్యారు.
ఒకవేళ మన తెలుగు ప్రొడ్యూసర్లు లోకేష్ ను నమ్మి సినిమా చేసి ఉంటే మూడు నాలుగు రెట్లు అధికంగా లాభాలు సంపాదించేవారు.అంతేకాదు లోకేష్ మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేసి ఉండేవాడు.
లోకేష్ ప్రతిభను జడ్జ్ చేయడంలో తెలుగు నిర్మాతలు దారుణంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.