జీవితంలో సక్సెస్ కావాలంటే ఎన్నో దారులు ఉంటాయి.కృషి, తెలివితేటలతో కష్టపడితే కెరీర్ పరంగా సులువుగా సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది.
విశాల్ మెగా మార్ట్( Vishal Mega Mart ) వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్( Ram Chandra Agarwal ) సక్సెస్ స్టోరీ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యం విషయంలో ఎప్పుడూ నెగిటివ్ గా ఫీల్ కాలేదు.
1986 సంవత్సరంలో ఆయన చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని మొదలుపెట్టారు.కోల్ కతాలో 15 సంవత్సరాల పాటు బట్టల బిజినెస్ చేసిన ఆయన 2001 సంవత్సరంలో విశాల్ రిటైల్ సంస్థను మొదలుపెట్టారు.బిజినెస్ లో సక్సెస్ సాధించిన రామచంద్ర అగర్వాల్ విశాల్ రిటైల్స్ ను విశాల్ మెగా మార్ట్ గా మార్చారు.2008 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పతనం వల్ల ఆయన మార్ట్ ఇబ్బందులను ఎదుర్కొంది.

ఆ సమయంలో రామచంద్ర అగర్వాల్ శ్రీరామ్ గ్రూప్ కు( Sriram Group ) తన కంపెనీని విక్రయించారు.ఆ తర్వాత వీ2 రిటైల్ సంస్థను మొదలుపెట్టిన రామచంద్ర అగర్వాల్ మరోసారి తనదైన ముద్ర వేసి ప్రశంసలు అందుకున్నారు.ఈ సంస్థ 800 కోట్ల రూపాయల టర్నోవర్ ను నమోదు చేసింది.లైఫ్ లో ఎదురుదెబ్బలు తగిలినా వాటిని తట్టుకొని నిలబడి సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు.

రామచంద్ర అగర్వాల్ మాత్రం తన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకుంటున్నారు.తనలా వ్యాపారం చేయాలని కలలు కనేవాళ్లకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.రామచంద్ర అగర్వాల్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రామచంద్ర అగర్వాల్ టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తప్పు లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారవేత్త రామచంద్ర అగర్వాల్ వ్యాపార రంగంలో సాధించిన విజయాలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.