ఈ మధ్య కాలంలో తరుచుగా మెట్రో ట్రైన్( Metro Train ) సంబంధిత వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తరచుగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించే వారి మధ్య జరిగే సంఘర్షణలు, మెట్రో ట్రైన్ లో చేసే వింతలు విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.
ఇకపోతే తాజాగా బెంగళూరు మెట్రో ట్రైన్ లో ఇద్దరు వ్యక్తులు గొడవ పడిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
బెంగళూరు( Bengaluru ) నగరంలో ఇద్దరు వ్యక్తులు మెట్రో ట్రైన్ లో ప్రయాణించగా అకస్మాత్తుగా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది.అనంతరం పదాల మార్పిడి, శారీరిక వాగ్వాదం కూడా జరిగినట్లు వీడియోలో కనబడుతుంది.ఇక ఆ గొడవ మరింత పెద్దగా అయ్యేసరికి ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకొని పరిస్థితిని సద్దుమణించే ప్రయత్నం చేశారు.ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇలా తరచూ మెట్రో ట్రైన్ లో జరిగే వాగ్విదాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రజా రవాణా భద్రత పై గురించి చాలా మంది ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరికొందరు ఇలాంటి గొడవలు జరగకుండా రైల్లో భద్రత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇక వారి ఇద్దరూ ఎందుకు గొడవ పడ్డారన్న విషయానికి వస్తే.ఒక నెటిజన్ లాప్టాప్ బ్యాగ్స్ అడ్డు వస్తున్నాయన్న తరుణంలో ఈ గొడవ జరిగినట్లు వారి అభిప్రాయాన్ని వ్రాసుకొచ్చారు.
కాబట్టి ఇలా రద్దీగా ఉన్న ప్రయాణంలో కొద్దిసేపు ఓపిక పట్టడం మెలవుతుంది.లేకపోతే అనవసరపు గొడవలకు దారి తీస్తుంది.