హీరో అంటే ఎలా ఉంటారు సినిమాలు తీసుకుంటారు, వాటిని ప్రమోట్ చేసుకుంటారు, కాసుల వర్షం కురిపించుకుంటారు, అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు.కానీ ఎవరైనా వివాదాలను పెంచుకుంటూ వెళ్తారా.? కానీ తాను అందరిలా కాదు కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా నా రూటే సపరేటు అంటూ ప్రతిసారి వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నాడు హీరో దర్శన్( Darshan ).తాజాగా అతని హత్య చేశాడు అంటూ ఆరోపణలు చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.దీంట్లో దర్శన్ దోషగా తేలుతాడా లేక నిర్దోషిగా బయటకు వస్తాడు అనే విషయం కాసేపు పక్కన పెడితే గత పదిలలో దర్శన్ ఎదుర్కొన్న అనేక వివాదాలు ఏంటో అవి ఎందుకు జరిగాయో అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొట్టమొదటిసారిగా దర్శన్ పోలీస్ స్టేషన్ కి మెట్లు ఎక్కింది ఈ 2011లో.గృహహింస ఆరోపణలు చేస్తూ ఆయన భార్య విజయలక్ష్మి దర్శన్ పై కేసు పెట్టారు.ఈ విషయంలో కొన్ని రోజులపాటు జైలుకు కూడా వెళ్లారు దర్శన్.
ఇక 2016లో ఇంటి బయట రచ్చ రచ్చ చేసి మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.అభ్యంతరకరమైన రీతిలో పక్కన ఉన్న వారితో ప్రవర్తిస్తూ దర్శన్ ప్రదర్శించడానికి అప్పట్లో చాలా మంది ఖండించారు.
ఇక 2021 లో ఒక హోటల్ వెయిటర్ ని అవమానించడంతో కూడా దర్శన్ బాగా ట్రౌలింగ్ కి గురయ్యారు.
స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) మరణించిన సమయంలో ఆయన పై అనుచిత వ్యాఖ్యలు చేసి పునీత్ అభిమానుల చేత చివాట్లు తిన్నాడు దర్శన్.2023లో కాటేరా సినిమా విజయం సాధించడంతో పబ్లిక్ లో చాలా న్యూసెన్స్ చేశాడు.నైట్ పార్టీ పెట్టి తనతో పాటు కొంతమంది సెలబ్రిటీలను కూడా చాలా రిస్క్ లో పడేశాడు దర్శన్.
ఈ సందర్భంగా లా వాయిలేషన్ కూడా జరిగింది.అప్పుడు దర్శన్ మరియు తన కో- యాక్టర్స్ పై కేసు కూడా ఫైల్ అయింది.
ఇక ఇదే ఏడాది వన్యప్రాణి మాంసాన్ని తిన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైతం దర్శన్ ఇంటిపై రైడ్ చేసింది ఈ విషయంలో కూడా అతడు చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు.ఇక ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ప్రమేయాన్ని రుజువు చేసే పనిలో ఉన్నారు పోలీసులు.