రాజన్న సిరిసిల్ల జిల్లా : బడిబాట కార్యక్రమం( Badi Bata Program )లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నెహ్రూ నగర్, గీతా నగర్ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాలకు జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి,డి ఆర్ డి ఓ శేషాద్రి, డీఈఓ రమేష్ కుమార్ హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు బుధవారం పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమాల్లో అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్మన్ రుక్మిణి, పాఠశాలల హెచ్ఎంలు భాగ్య రేఖ, శారద, సెక్టోరియల్ ఆఫీసర్ సతీష్ కుమార్ , మండల విద్యాధికారి దూస రఘుపతి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.